Begin typing your search above and press return to search.

మ‌ద్యం మ‌త్తులో హైద‌రాబాద్ యువ‌త చిత్తు

By:  Tupaki Desk   |   8 July 2016 5:30 PM GMT
మ‌ద్యం మ‌త్తులో హైద‌రాబాద్ యువ‌త చిత్తు
X
మ‌ద్యం మ‌త్తులో బాల్యం చితికి పోతోంది. కేవ‌లం యువ‌కులు - ఆ పైబ‌డిన వ‌య‌సున్న వారే మ‌ద్యానికి బానిస‌ల‌య్యార‌నే ప‌రిస్థితులు నేడు మారిపోయాయి. మందు తాగ‌డం ఓ హాబీగా త‌యారైంది. ఇద్ద‌రు క‌లిస్తే సిగ‌రెట్‌.. న‌లుగురు క‌లిస్తే మందు అన్న‌ట్టుగా ఉంది ప్ర‌స్తుత ప‌రిస్థితి. అయితే, ఈ వ్య‌సనమ‌నే జాడ్యం 12 ఏళ్ల బాల‌లకు కూడా అంటుకోవ‌డ‌మే ప్ర‌స్తుతం దేశాన్ని వ‌ణికింప చేస్తున్న ప‌రిణామం. విదేశీ అల‌వాట్లు అనండి - ఒక‌రిని చూసి మ‌రొక‌రు నేర్చుకుంటున్నారు అనండి ఏదేమైనా దేశంలోని బాల‌లు మద్య‌పానానికి బానిస‌లుగా మారుతున్నార‌నేది ప‌చ్చి నిజం. అంతేకాదు, దేశంలో ఏటా 5వేల మంది బాల‌లు కేవ‌లం మ‌ద్యం కార‌ణంగా మ‌ర‌ణిస్తున్నార‌ని ఓ స‌ర్వే కుండ‌బ‌ద్ద‌లు కొట్టింది.

మ‌రో ముఖ్య విష‌యం ఏంటంటే ఇండియాలోనే అభివృద్ధికి సూచిక‌గా మారుతున్న న‌గ‌రాల‌లో ఒక‌టైన హైద‌రాబాద్‌ లో మ‌ద్యానికి బానిస‌వుతున్న యువ‌త సంఖ్య నానాటికీ పెరుగుతుండ‌డం శోచనీయం. ప్ర‌భుత్వాలు ఎన్ని డీ అడిక్ష‌న్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నా.. ఫ‌లితం ఉండ‌డం లేదు. టీనేజర్లలో ఎక్కువగా మద్యానికి బానిసలవుతున్న వారిలో దేశవ్యాప్తంగా హైదరాబాద్ నాలుగో స్థానంలో నిలిచినది. చాలా మంది పిల్లలు 12 ఏళ్ల నుంచే మద్యానికి బానిసలు గా మారుతున్నారని ఈ నివేదికలు వెల్లడిస్తున్నాయి. చివరి పది సంవత్సరాలలో హైదరాబాద్ లో ఆల్కహాల్ వినియోగం 41 శాతం పెరిగిందని నివేదికలు వెల్లడిస్తున్నాయి.

దీని ప్ర‌ధాన కార‌ణం.. నగరం లో విచ్చల విడిగా వెలసిన మద్యం దుకాణాలు - వీటికి తోడు ప్రతి వీధి చివరన ఉంటున్న బెల్టు షాప్‌ లు - అక్రమంగా మద్యం విక్రయాలకు పాల్పడుతుండడం. అంతేకాకుండా మ‌ద్యం దుకాణాల్లోనూ విచ్చ‌ల‌విడి నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న‌. దీంతో మద్యానికి బానిసలుగా మారి దేశవ్యాప్తం గా ప్రతి ఏటా 5000 మంది టీనేజర్లు మరణిస్తున్నట్లు సర్వే లో వెల్లడైంది. మ‌రి ఈ ప‌రిణామం భ‌విష్య‌త్ యువ భార‌తాన్ని ఏదిశ‌గా న‌డిపిస్తుందో పాల‌కులే ఆలోచించాలి.. ఇప్ప‌టికైనా చ‌ర్య‌లు తీసుకోవాలి.. అని ప‌లువురు కోరుతున్నారు.