Begin typing your search above and press return to search.

అమెరికాలో హైదరాబాద్ మహిళ దుర్మరణం.. ఏం జరిగిందంటే ?

By:  Tupaki Desk   |   13 Nov 2020 5:20 PM IST
అమెరికాలో  హైదరాబాద్ మహిళ దుర్మరణం.. ఏం జరిగిందంటే ?
X
అమెరికాలోని టెక్సాస్ , ఆస్టిన్‌ లో ఈ నెల 7న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ కి చెందిన ఓ మహిళ ప్రాణాలు విడిచింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌ కు చెందిన నేహా రెడ్డి మద్దిక అనే మహిళ ప్రాణాలు కోల్పోయారు. నేహ రెడ్డి స్నేహితురాలు ప్రియాంక రెడ్డి చెప్పిన వివరాల ప్రకారం... నవంబర్ 7న తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో సౌత్ 1st స్ట్రీట్, వెస్ట్ మేరీ స్ట్రీట్ మధ్య రెండు వాహనాలు ఒకదానొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నేహా రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసినట్టు ప్రియాంక తెలిపారు.

యాక్సిడెంట్ లో నేహా తలకు బలమైన గాయాలు కావడంతో మెదడు దెబ్బతిని మరణించినట్లు సమాచారం. అందిరితో ఎంతో కలిసిమెలిసి ఉండే నేహా ఇలా రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం ఆమె స్నేహితులు తీవ్రమైన మనో వేదనకి గురౌతున్నారు. ఇక మృతురాలికి అమెరికాలో ఎవరూ లేకపోవడంతో మృతదేహాన్ని హైద్రాబాద్‌కు తరలించేందుకు గోఫండ్‌మీ ద్వారా నిధులు సేకరిస్తున్నట్లు ప్రియాంక చెప్పారు. కాగా, ఆరు నెలల కింద నేహా తండ్రి విజయ్ భాస్కర్ రెడ్డి మరణించారని.. ఇంతలోనే తమ స్నేహితురాలు కూడా చనిపోవడం బాధాకరమని ప్రియాంక తెలిపారు. ఇక ఇదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో నలుగురు క్షతగాత్రులను శనివారం ఉదయం చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్లు ఆస్టిన్-ట్రావిష్ కౌంటీ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ ట్వీట్ చేసింది.