Begin typing your search above and press return to search.

తెలుగోళ్లకు పండుగ.. టీ20 మ్యాచ్ కు వేదికగా హైదరాబాద్

By:  Tupaki Desk   |   22 July 2022 4:28 AM GMT
తెలుగోళ్లకు పండుగ.. టీ20 మ్యాచ్ కు వేదికగా హైదరాబాద్
X
దగ్గర దగ్గర మూడేళ్ల (మరింత సరిగ్గా చెప్పాలంటే 34 నెలలు) తర్వాత అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ కు వేదికగా నిలుస్తోంది హైదరాబాద్ మహానగరం.

తెలుగు ప్రాంతాల్లోని క్రికెట్ క్రీడాభిమానులకు ఈ న్యూస్ ఒక పండుగ లాంటిదని చెప్పక తప్పదు. సొంత గడ్డపై టీమిండియా ఆసీస్.. సౌతాఫ్రికాలో పరిమిత ఓవర్ల సిరీస్ లు ఆడనున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ముందుగా ఆస్ట్రేలియాతో మూడు టీ20 మ్యాచ్ లు ఆడనుంది.

అనంతరం సౌతాఫ్రియాతో మూడు టీ20లు.. మరో మూడు వన్డేలు ఆడనుంది. దీనికి సంబంధించి షెడ్యూల్ ను బీసీసీఐ దాదాపుగా సిద్ధం చేసిందనే చెప్పాలి.

భారత్.. ఆస్ట్రేలియాల మధ్య జరిగే మూడు టీ20 మ్యాచ్ లలో.. మూడో మ్యాచ్ కు హైదరాబాద్ వేదిక కానుంది. సెప్టెంబరు 25న ఉప్పల్ లో జరిగే ఈ మ్యాచ్ తెలుగు అభిమానులకు పండగ్గా మారుతుందని చెప్పక తప్పదు. ఉప్పల్ స్టేడియంలోచివరగా జరిగింది భారత్ - వెస్టిండీస్ మధ్య టీ20 మ్యాచ్ గా చెప్పాలి. 2019 డిసెంబరులో జరిగిన ఈ మ్యాచ్ తర్వాత కరోనా పుణ్యమా అని జరిగింది లేదు.

మళ్లీ ఇన్ని నెలల తర్వాత జరుగుతున్న ఈ టీ20 మ్యాచ్ తో హైదరాబాద్ సరికొత్త కళను సంతరించుకుంటుందని చెప్పకతప్పదు. ఆస్ట్రేలియా జట్టుతో జరిగే మూడు టీ20 మ్యాచ్ లకు మూడో మ్యాచ్ హైదరాబాద్ వేదిక అయితే.. మిగిలిన రెండు మ్యాచ్ లకు మొహాలి.. నాగ్ పూర్ లు వేదికగా నిలవనున్నాయి. మొదటి మ్యాచ్ సెప్టెంబరు 20న.. రరెండో మ్యాచ్ సెప్టెంబరు 23న జరగనుంది.

ఇక.. సౌతాఫ్రికా జట్టుతో జరిగే మ్యాచ్ ల షెడ్యూల్ వెల్లడైంది. సెప్టెంబరు 28.. అక్టోబరు 1.. 3 తేదీల్లో టీ20 మ్యాచ్ లు జరుగుతాయి. వీటికి వేదికలుగా త్రివేండ్రం.. గువహటి.. ఇండోర్ స్టేడియంలు కన్ఫర్మ్ చేశారు. అదే సమయంలో పరిమిత ఓవర్ల వన్డే మ్యాచ్ లు అక్టోబరు ఆరు.. తొమ్మిది.. పదకొండు తేదీల్లో జరగనున్నాయి. వీటికి వేదికలుగా రాంచీ.. లక్నో.. న్యూఢిల్లీలు వేదిక కానున్నాయి.