Begin typing your search above and press return to search.
హైదరాబాద్ - విజయవాడ రహదారి ఎందుకు బంద్ అయ్యింది?
By: Tupaki Desk | 14 Oct 2020 10:15 AM ISTఇటీవల కాలంలో ఎప్పుడూ చూడనిరీతిలో హైదరాబాద్ మహానగరాన్ని వర్షం ముంచెత్తింది. ఆకాశానికి చిల్లులు పడ్డాయా? అన్న రీతిలో ఏకధారగా కురుస్తున్న వర్షం.. మంగళవారం సాయంత్రం ఐదు గంటల తర్వాత నుంచి మరింతగా పెరగటంతో.. పరిస్థితి దారుణంగా మారింది. వర్షం కారణంగా విమాన రాకపోకలకు అంతరాయం చోటు చేసుకోవటం తెలిసిందే. అందుకు భిన్నంగా.. చాలా రోజుల తర్వాత హైదరాబాద్ - విజయవాడ రహదారి బంద్ అయిన పరిస్థితి.
హైదరాబాద్ నగర శివారులోని రామోజీ ఫిలిం సిటీ దాటిన తర్వాత అబ్దుల్లాపూర్ మెట్ కు కాస్త దూరంలో భారీ ఎత్తున వాహనాలు రోడ్ల మీద నిలిచిపోయాయి. దీనికి కారణం హైవే మీద వర్షపు నీరు భారీగా ప్రవహిస్తుండటంతో వాహనాలు ముందుకు కదల్లేని పరిస్థితి చోటు చేసుకుంది. దీనికి తోడు.. నీటి ప్రవాహ తీవ్రతకు ఒక వాహనం ఇరుక్కుపోవటంతో.. మిగిలిన వాహనాలు ముందుకు వెళ్లలేని పరిస్థితి. విశాలంగా ఉండే జాతీయ రహదారి మీద వాహనాలు దాదాపు 10కి.మీ. మేర నిలిచిపోయాయంటే ట్రాఫిక్ జాం తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
దీంతో.. వర్షం తాకిడికి ముందుకు వెళ్లలేక.. అలా అని వెనక్కి పోలేక.. ఇరుక్కుపోయిన వారి తిప్పలు అన్ని ఇన్ని కావు. గంటల కొద్దీ రోడ్ల మీద అది కూడా వర్షం భారీగా పడుతున్న వేళ.. వాహనాల్లో నుంచి బయటకు రాలేక నరకయాతకు గురయ్యారు. చాలా ఏళ్ల తర్వాత హైదరాబాద్ - విజయవాడ మధ్య దారిని కొన్ని గంటల పాటు మూసేశారు. పరిస్థితి తీవ్రత గురించి సమాచారం అందుకున్న అధికారులు రంగంలోకి దిగి.. వాహనాల్ని దారి మళ్లించారు.