Begin typing your search above and press return to search.

హైదరాబాద్ జంట పేలుళ్లు..ఇద్దరు దోషులు..

By:  Tupaki Desk   |   4 Sept 2018 2:29 PM IST
హైదరాబాద్ జంట పేలుళ్లు..ఇద్దరు దోషులు..
X
11 ఏళ్ల నుంచి పడుతున్న బాధకు విముక్తి లభించింది. 2007లో హైదరాబాద్ లో జరిగిన జంట బాంబు పేలుళ్లలో మరణించిన 32మంది అమయాకుల కుటుంబసభ్యులు - బంధువులకు ఊరట లభించింది. ఈ కేసులో మొత్తం ఐదుగురు నిందితుల్లో ముగ్గురిని నిర్ధోషులుగా తేల్చిన నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం.. ఇద్దరినీ దోషులుగా నిర్ధారించింది.

దాదాపు 11 ఏళ్ల విచారణ తర్వాత ఆరోపణలు ఎదుర్కొంటున్న అక్బర్ ఇస్మాయిల్ - అనిక్ షరీక్ సయిద్ లను దోషులుగా కోర్టు నిర్ధారించింది. వీరికి వచ్చే సోమవారం నాంపల్లి కోర్టు శిక్షలు ఖరారు చేయనుంది.

2007 ఆగస్టు 25న గోకుల్ చాట్ - లుంబినీ పార్క్ లో ఇండియన్ ముజాహిదిన్ (ఐఎం) ఉగ్రవాదులు పేలుళ్లకు పాల్పడ్డారు. గోకుల్ చాట్ వద్ద 32మంది మరణించగా.. 47మందికి గాయాలయ్యాయి. ఇక లుంబినీ పార్క్ లో 12మంది మరణించగా 21మంది గాయాలపాలయ్యారు. దిల్ సుఖ్ నగర్ లో బాంబును కనిపెట్టి నిర్వీర్యం చేశారు.

ఈ కేసులో మొత్తం ఐదుగురిపై ఎన్.ఐ.ఏ అధికారులు అభియోగాలు మోపారు. కేసులో తుది వాదనలు ఆగస్టు 7న ముగిశాయి. తీర్పును ఈరోజు వెల్లడించారు. ఇద్దరిని దోషులుగా నిర్ధారించింది. శిక్షలు సోమవారం ఖరారు చేయనుంది. కోర్పు తీర్పు నేపథ్యంలో చర్లపల్లి జైలు పరిసరాల్లో పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.