Begin typing your search above and press return to search.

బాలయ్యను వదలని హైదరాబాద్ పోలీసులు

By:  Tupaki Desk   |   3 Jan 2021 10:08 AM GMT
బాలయ్యను వదలని హైదరాబాద్ పోలీసులు
X
క్రిస్మస్ - కొత్త సంవత్సరంతో అందరూ సెలవులు తీసుకొని ఈ వీకెండ్ ను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అంతా మందు, విందులతో తెగ హల్ చల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు సైతం కరోనా లాక్ డౌన్ తర్వాత డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు చేస్తూ మళ్లీ మందుబాబుల పనిపడుతున్నారు. అయితే పోలీసులు యువతకు ఎన్ని జాగ్రత్తలు చెబుతున్నా వారు వినడం లేదు.

అందుకే యూత్ స్టైల్లోనే చెప్పాలని డిసైడ్ అయ్యారు. కొంచెం సినిమాటిక్ గా చెబితే మరింతగా రక్తకడుతుందని.. జనాల్లోకి వెళుతుందని ఆలోచించారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ పోలీసులు ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో బాలక్రిష్ణను తమ ప్రచారానికి వాడుకున్నారు.

తాజాగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తమ సోషల్ మీడియా ట్విట్టర్ లో పెట్టిన పోస్ట్ వైరల్ అయ్యింది. హీరో నందమూరి బాలక్రిష్ణ ఫొటో పెట్టి ఆయన చెప్పిన డైలాగ్ ఒకదాన్ని తీసుకొని మందుబాబులకు వేసిన పంచ్ ఆకట్టుకుంటోంది.

బాలయ్య ‘లయన్’ సినిమాలో పేల్చిన ‘అప్పుడే అయిపోయిందని అనుకోకండి.. లోపల ఇంకా చాలా దాచిపెట్టాం’ అన్న డైలాగును తాజాగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తీసుకొని ‘అప్పుడే అయిపోయిందని అనుకోకండి.. ఇంకా చాలా ఉంది. వీకెండ్ గురించి దాచి ఉంచాం’ అని బాలయ్యను పెట్టి క్యాప్షన్ ఇచ్చారు. వెనుకాల డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్న ఫొటో పెట్టారు. కొత్త సంవత్సరం వేళ ప్రజలకు హెచ్చరికగా పోలీసులు చేసిన ఈ పోస్టు వైరల్ గా మారింది.