Begin typing your search above and press return to search.

హైదరాబాద్ పోలీస్ కికి ఛాలెంజ్ చూశారా?

By:  Tupaki Desk   |   20 Aug 2018 8:05 AM GMT
హైదరాబాద్ పోలీస్ కికి ఛాలెంజ్ చూశారా?
X
కికి ఛాలెంజ్.. ఈ మధ్య సామాజిక మాధ్యమాల్లో బాగా పాపులర్ అయిన ఒక పోకడ.. ప్రపంచాన్ని ఊపేస్తున్న ఒక విన్యాసం. ఒక పాప్ సాంగ్ ప్లే అవుతుండగా.. కార్లోంచి దిగి.. అది నడుస్తుండగా డ్యాన్స్ చేసే ఈ ఛాలెంజ్ ను చాలామంది సెలబ్రెటీలు స్వీకరించారు. సామాన్యులూ ట్రై చేశారు. ఐతే ఈ ఛాలెంజ్ కొంచెం ప్రమాదకరంగా ఉండటంతో దీన్ని అనుసరించవద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ చాలామంది దీన్ని ప్రయత్నిస్తూనే ఉన్నారు. హైదరాబాద్ నగర వాసులు ఇంకా పలువురు ఈ ఛాలెంజ్ ను ట్రై చేస్తుండటంతో స్థానిక పోలీసులు వారిని హెచ్చరించడం కోసం ‘కికి ఛాలెంజ్’ స్పూఫ్ వీడియో ఒకటి రూపొందించారు.

ఈ వీడియోలో ‘కికి ఛాలెంజ్’ స్వీకరించిన ఇద్దరు యువకులు కారు నుంచి దిగి డ్యాన్స్ చేయబోతుండగా.. వాళ్లను పోలీసులు పట్టుకుపోతారు. ఇలాంటివి ఎవరైనా ట్రై చేస్తే జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరిక జారీ చేయడానికే పోలీసులు ఈ వీడియోను రూపొందించారు. దీన్ని హైదరాబాద్ పోలీస్ అఫీషియల్ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. సామాజిక మాధ్యమాల్లో హైదరాబాద్ పోలీస్ శాఖ చాలా చురుగ్గా ఉంటోంది. సెలబ్రెటీల సాయంతో జనాల్లో చైతన్యం తీసుకొచ్చే ఆసక్తికర వీడియోలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగానే తాజా వీడియోను రూపొందించారు. కికి ఛాలెంజ్ కారణంగా ప్రమాదాలు కొని తెచ్చుకుని ఆసుపత్రుల పాలైన వాళ్లు చాలామందే ఉన్నారు. వాటికి సంబంధించిన వీడియోలు చాలానే సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా కనిపిస్తున్నాయి.

వీడియో కోసం క్లిక్ చేయండి