Begin typing your search above and press return to search.

అమెరికాలో హైద‌రాబాద్ టెకీ మృతి

By:  Tupaki Desk   |   24 Jan 2018 12:31 PM GMT
అమెరికాలో హైద‌రాబాద్ టెకీ మృతి
X
అమెరికాలో హైద‌రాబాద్ టెకీ మృతి చెందారు. హైదరాబాద్ నివాసి అయిన ఐటీ ఉద్యోగి చైతన్యరెడ్డి(36) గుంటుక అనే వ్యక్తి గుండెపోటుకు గురై హుస్టన్ నగరంలో మృతిచెందాడు. సీనియర్ సాఫ్ట్‌ వేర్ క్యూఏ అనలిస్ట్‌ గా హుస్టన్‌ లోని రాయల్ టెక్నోక్రాట్స్‌లో చైతన్య పనిచేస్తున్నాడు. యూఎస్‌ లో ఐటీ ఉద్యోగిగా అతను పదేళ్ల నుంచి పనిచేస్తున్నాడు. ఈ మధ్యనే అతను కంపెనీ మారాడు. విధులు నిర్వ‌హిస్తున్న స‌మ‌యంలోనే ఆయ‌న గుండెపోటుకు లోన‌య్యారు.

చైత‌న్య‌రెడ్డి హైదరాబాద్‌ లోని శ్రీ సత్యసాయి కంప్యూటర్ ఇనిస్టిట్యూట్ నుంచి పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్.. కర్ణాటకలోని గుల్బార్గా యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీని పూర్తిచేసిన చైతన్య టెక్సాస్‌ లోని లామర్స్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పట్టాను అందుకున్నాడు. అంతిమ సంస్కారాల నిమిత్తం మృతదేహాన్ని హైదరాబాద్‌ కు తరలించేందుకు స్థానిక తెలంగాణ సంస్థ మృతుడి కుటుంబ సభ్యులకు సహకారం అందిస్తుంది.