Begin typing your search above and press return to search.

అక్కడ సినిమాకెళ్లిన తెలుగోడు శవమయ్యాడు

By:  Tupaki Desk   |   5 Aug 2016 10:44 AM IST
అక్కడ సినిమాకెళ్లిన తెలుగోడు శవమయ్యాడు
X
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు వ్యక్తి దుర్మరణం పాలయ్యారు. హైదరాబాద్ కు చెందిన 24 ఏళ్ల విక్రమ్ గౌడ్ రోడ్డు ప్రమాదానికి గురై.. ఘటనాస్థలంలోనే మరణించాడు. బంజారాహిల్స్ రోడ్ నెంబరు 13లో నివాసం ఉండే విక్రమ్.. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తూ.. గత ఏడాది డిసెంబరు నుంచి కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీలోని వర్సిటీలో పీజీ చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ కు చెందిన మరో ఆరుగురు స్టూడెంట్స్ తో కలిసి కాలిఫోర్నియాలో ఉంటున్న విక్రం.. గత శుక్రవారం స్నేహితులతో కలిసి సినిమాకు వెళ్లారు.

సినిమా చూసిన తర్వాత అర్థరాత్రి 2.30 గంటల ప్రాంతంలో వీరు తిరిగి వస్తుండగా.. కారుకు అడ్డంగా గుర్తు తెలియని వ్యక్తి వచ్చినట్లుగా చెబుతున్నారు. దీంతో..స్పీడ్ బ్రేక్ వేయగా.. కారు పల్టీ కొట్టిందని..ఈ ఘటనలో కారు వెనుక సీటులో కూర్చున్న విక్రం తీవ్ర గాయాలకు గురై.. ఘటనాస్థలంలోనే మరణించినట్లు చెబుతుతున్నారు. కారులోని మిగిలిన నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

రోడ్డు ప్రమాదంలో మరణించిన విక్రమ్ సమాచారం వారికుటుంబానికి పెద్ద షాక్ గా మారింది. ఎన్నో ఆశలతో అమెరికాకు పంపిన తమ కొడుకు.. విగతజీవిగా మారి రావటంపై వారు కన్నీరుమున్నీరుఅవుతున్నారు. పీజీ తర్వాత ఉద్యోగంలో చేరి.. ఉన్నత స్థాయికి చేరాలని తపించిన తమ కొడుకు ఆశలు తీరకుండా వెళ్లిపోయాడంటూ అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. దేశం కాని దేశానికి వెళ్లిన వేళ.. అర్థరాత్రి దాటిన వేళ.. సినిమాలకు వెళ్లటం.. వేగంగా కారు నడపటం లాంటివి వీలైనంతవరకూ స్కిప్ చేయటం మంచిదన్న సూచన వ్యక్తమవుతోంది.