Begin typing your search above and press return to search.
అమరావతి ఎఫెక్ట్ : హైదరాబాద్‌లో జోరుగా రియల్ ఎస్టేట్... 26 శాతం పెరిగిన ఇళ్ల అద్దెలు... దేశంలోనే అత్
By: Tupaki Desk | 2 March 2021 8:00 PM ISTరియల్ ఎస్టేట్ కు సంబంధించి ఇప్పటికే పలు అంశాల్లో టాప్ లో ఉన్న హైదరాబాద్ మహానగరం మరో విషయంలోనూ నెంబర్ వన్ స్థానంలో ఉన్న కొత్త విషయం తాజాగా బయటకు వచ్చింది. దేశంలోని మరే నగరంతో పోల్చినా హైదరాబాద్ తర్వాతేనని చెబుతున్నారు. బెంగళూరు.. ఫుణే.. ఢిల్లీ లాంటి మహానగరాల్ని తోసిరాజని.. హైదరాబాద్ మొదటి స్థానంలో నిలవటం విశేషం. గడిచిన ఆరేళ్లలో లగ్జరీ రెసెడెన్షియల్ ప్రాపర్టీ రెంట్లు దాదాపు 26 శాతం పెరిగినట్లుగా అన్ రాక్ ప్రాపర్టీ కన్సలెంట్ పేర్కొంది. దేశంలో మరే ప్రధాన నగరాల్లో ఇంత స్పీడ్ లేదంటున్నారు.
ఉదాహరణకు 2014లో హైటెక్ సిటీలో రూ.42వేలుగా ఉన్న అద్దెలు.. 2020 నాటికి 26 శాతం పెరుగుదలతో రూ.53వేలకు చేరుకున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా జూబ్లీహిల్స్ లో రూ.47 వేల నుంచి పదిహేను శాతం పెరిగి రూ.54 వేలకు చేరుకున్నట్లు చెప్పారు. క్యాపిటల్ ప్రైస్ లు కూడా ఎక్కువగా ఉన్నట్లుగా తాజా అధ్యయనం స్పష్టం చేస్తోంది.
2014లో హైటెక్ సిటీలో చదరపు అడుగు ధర రూ.5088 ఉండగా.. 2020 నాటికి 12 శాతం పెరిగి రూ.5675కు చేరినట్లు చెప్పారు. జూబ్లిహిల్స్ లో రూ.6300 నుంచి పదిశాతం పెరుగుదలతో రూ.6950కు పెరిగినట్లు చెబుతున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో 2 వేల అడుగుల విస్తీర్ణం ఉండే లగ్జరీ ఇళ్ల నెలవారీ అద్దె గత ఆరేళ్లలో 17-26 శాతం పెరిగినట్లుగా అన్ రాక్ ప్రాపర్టీ వెల్లడించింది.
2014తో పోలిస్తే 2020 నాటికి వివిధ నగరాల్లో పెరిగిన లగ్జరీ ఇళ్ల అద్దెల గురించి వివరించారు. గుర్గావ్ లోని గోల్ఫో కోర్స్ రోడ్ లో 18 శాతం పెరిగింది. బెంగళూరులోని జేపీ నగర్ లో అద్దెలు 24 శాతం.. చెన్నైలోని అన్నానగర్ లో అద్దె 17 శాతం.. కోల్ కతాలోని అలీపోర్ లో అద్దె 20 వాతం.. ఎంఎంఆర్ లోని టార్డియోలో 23 శాతం.. ఫూణెలోని ప్రభాత్ రోడ్ లో అద్దెలు 23 శాతం పెరిగినట్లుగా ఈ నివేదిక పేర్కొంది. ఈ నగరాల్ని తోసిరాజని హైదరాబాద్ మొదటి స్థానంలో నిలవటం గమనార్హం.