Begin typing your search above and press return to search.

డ్రగ్స్ తీసుకున్న 300 మంది లిస్ట్ విడుదల చేసిన పోలీసులు!

By:  Tupaki Desk   |   4 Jun 2020 4:00 PM IST
డ్రగ్స్ తీసుకున్న 300 మంది లిస్ట్ విడుదల చేసిన పోలీసులు!
X
టాలీవుడ్ డ్రగ్స్ దందా గతంలో తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం దీనిపై సిట్ వేయగా.. పలువురు సినీ హీరోలు, దర్శకులు, నటుల పేర్లు కూడా బయటపడడం చర్చనీయాంశమైంది. అయితే హైదరాబాద్ ను డ్రగ్స్ దందా వీడలేదని తాజాగా మరోసారి బయటపడింది.

తాజాగా లాక్ డౌన్ లోనూ ఈ డ్రగ్స్ దందా హైదరాబాద్ లో కొనసాగడం విశేషం. తరుణ్ జ్యోతి సింగ్, అమిత్ అనే డ్రగ్స్ డీలర్లు బెంగళూరు , ముంబై నుంచి ఎన్95 మాస్కుల పేరిట డ్రగ్స్ తీసుకొచ్చి 10 గ్రామాలు చొప్పున హైదరాబాద్ లో అమ్ముతుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా హైదరాబాద్ లో దాదాపు 300 మందికి ఈ డ్రగ్స్ అమ్మినట్టు పేర్కొన్నారు. ఎక్కువగా జూబ్లిహిల్స్ లోనే ఈ డ్రగ్స్ అమ్మినట్టు విచారణలో తేలింది.

జూబ్లిహిల్స్ కు చెందిన షేక్ ఫైజ్, రాహుల్ రెడ్డి అనే వ్యక్తితోపాటు చాలా మందికి ఈ డ్రగ్స్ అమ్మినట్టుగా పోలీసులు లిస్ట్ ను మీడియాకు వెల్లడించారు. హైదరాబాద్ లోని ఫేమస్ పబ్ అయిన ఫ్యాట్ విజన్, స్నోట్ పబ్ గచ్చిబౌలి ద్వారా ఈ డ్రగ్స్ అమ్మకాలు చేసినట్టు పోలీసులు తెలిపారు.

దాదాపు 300మంది డ్రగ్స్ తీసుకున్నట్టుగా పోలీసులు గుర్తించి వారిని కౌన్సిలింగ్ నిర్వహించడానికి నిర్ణయించారు. డ్రగ్స్ దందా నిర్వాహకులను అరెస్ట్ చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ డ్రగ్స్ అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని టాస్క్ ఫోర్స్ పోలీసులు హెచ్చరించారు.