Begin typing your search above and press return to search.

“నోరూరించే భారతీయ రుచుల హైదరాబాద్ హౌస్ ఇప్పుడు కెరొలినాలో”

By:  Tupaki Desk   |   17 Nov 2016 1:30 PM GMT
“నోరూరించే భారతీయ రుచుల హైదరాబాద్ హౌస్ ఇప్పుడు కెరొలినాలో”
X
నార్త్ కెరొలినా - నవంబర్ 17 - 2016: హైదరాబాద్ హౌస్ వారి ఈ 18వ రెస్టారెంటు దేశీయ రుచులను కుటుంబం - మిత్రులతో పంచుకునే ఆనందవకాశాన్ని భారతీయలను అందించనుంది.

సంస్కృతికి - సంప్రదాయాలకు చారిత్రిక వైభవానికి పెట్టింది పేరు హైదరాబాద్. అలాగే ఏ సంస్కృతిలోనైనా ఎంతో ముఖ్యమైనది ఆహారం మరియు ఆహార అలవాట్లు - వంటకాల వైవిధ్యత. ఇటువంటి భాగ్యనగర వారసత్వాన్ని అమెరికాలో ముందుకి తీసుకువెళ్ళడానికి కృషి చేస్తోంది ప్రఖ్యాత హైదరాబాద్ హౌస్.

ఆనతి కాలంలోనే దేశవ్యాప్తంగా పేరు పొంది అత్యంత ఆదరణ చూరగొన్న హైదరాబాద్ హౌస్ ఇప్పుడు తన విస్తరణలో భాగంగా కెరొలినాలో అడుగుపెట్టింది.

తమ విస్తరణలోని ఈ 18వ రెస్టారెంటు మోరిస్ విల్లే ఎన్.సి లో మీ ఆఫీసులకు - ఇళ్ళకు ఎంతో చేరువలో ఉంటుంది, అతి ముఖ్యంగా మీ మనసులకు. అమెరికా జీవన విధానాన్ని - భారతీయ సంస్కృతీ ఆలోచన విధానాన్ని ఆహారంతో మేళవించే ఏకైక రెస్టారంట్ హైదరాబాద్ హౌస్.

పరిపూర్ణమైన భోజనంతో మీ ఆకలినే కాదు మనసులను కూడా నింపుతూ మీ కుటుంబాలని - మిత్రులతో ఆహారాన్ని - ఆనందాన్ని పంచుకునే అవకాశాన్ని మీకు కలిగించటం మాకు గర్వకారణం. అందుకే మా ప్రయత్నం మీరు ఊహించింది దానికంటే మరింత ఎక్కువగా, వైవిధ్యంతో కూడి రుచులను మీకు అందించటం.

ప్రారంభం సందర్భంగా మేము అందించే విందు పట్టిక ఎన్నో రుచులని కలుపుకుంటూ 50 దేశీయ మరియు కొత్త వంటకాలను అందిస్తుంది. నవరసాలను మేళవించి ఎన్నో ప్రాంతాలకు వన్నె తెచ్చిన వంటకాల్లో కొన్ని ముఖ్యమైనవి అంకాపూర్ చికెన్ - గోంగూర రొయ్యల ఇగురు - మొనగాడు కోడి వేపుడు - పేరు లేని కోడి - కరివేపాకు కోడి - పనీర్ కారైకుడి. ఇంకా మీరెంతో ఉత్సాహంతో ఎదురుచూసే నోరూరించే బిర్యానీ విభాగంలో 20 కి పైగా రకాలు.

ఉదయం 11.30 నించి రాత్రి 10 వరకు అందుబాటులో ఉండే హైదరాబాద్ హౌస్ వారాంతంలో, ఇతర సెలవు దినాలలో మరింత సమయం తెరిచి ఉంటుంది. రోజూ బఫెట్లో 90 మంది సౌకర్యంగా కూర్చునే విధంగా రెస్టారంట్ తీర్చిదిద్దబడింది. డేవిస్ డ్రైవ్ మరియు MC క్రిమ్మన్ Pkwy కి దగ్గర ఉంటుంది హైదరాబాద్ హౌస్ రెస్టారంట్. ఇది మన భారతీయులు నివసించే ప్రాంతాలకు కూడా చేరువలోనే ఉంటుంది.

ప్రత్యేక "రాజు గారి భోజనం" ద్వారా విస్తృతపరిచిన తెలుగు రుచులను అరిటాకు పైన వడ్డిస్తూ దేశీయ అనుభూతిని అందిస్తారు. దీనికి బిర్యానీ తో సమానంగా అనతికాలంలోనే ఎంతో ఆదరణ లభించింది.

ఇతర ఆకర్షణలు డైన్-ఇన్ - టు-గో - కేటరింగ్ - ఆన్ సైట్ దోస - లైవ్ చాట్ హోమ్ డెలివరీ మొదలగునవి.

ఈ సందర్భంగా మాట్లాడుతూ హైదరాబాద్ హౌస్ కరోలినా యాజమాన్యం కెరొలినాలో హైదరాబాద్ హౌస్ విస్తరించటం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. హైదరాబాద్ రుచులనే కాక భారతీయ వంటకాల్ని ఇంత దూరంలో ఉన్న మనవారికి దగ్గర చేయటం గొప్ప అనుభూతి అని అన్నారు. ఈ రెస్టారంట్ తక్కువ కాలంలో ఎంతో పేరు, ఆదరణ పొందుంటుంది అని వారు ఆశ వ్యక్తం చేసారు.

హైదరాబాద్ హౌస్ గురించి మరిన్ని వివరాలకు సంప్రదించండి

హైదరాబాద్ హౌస్ నార్త్ కరోలినా
డేవిస్ డ్రైవ్, #105
మోరిస్ విల్లే - ఎన్.సి 27560
ఫోన్: 919 924 0503
www.hydhousertp.com

అమెరికా వ్యాప్తంగా హైదరాబాద్ హౌస్ లైసెన్స్ రెస్టారెంట్లు: హ్యూస్టన్ - కేటీ - ప్లానో - ఆస్టిన్ (త్వరలో కొత్త చిరునామాకు మారనుంది) - ఫ్రిస్కో - నాపర్విల్లె - సెయింట్ లూయిస్ - ఓ ఫాలోన్ - బ్లూమింగ్టన్ - సాన్ అంటానియో - ఇండియానాపోలిస్ ప్రాంతాల్లో ఉన్నాయ్.

2016 రెస్టారెంట్లు:
సాన్ అంటనియో - ఇండియానాపోలిస్ - సియాటిల్ - నెవార్క్, సెంటేనియల్

డిసెంబర్ 2016:
షాంబోర్గ్: 3న
ఇర్వింగ్: 24న

మరిన్ని వివరాలకు:

శివ: 201-562-5753
వంశి: 551-208-4336
ఈమెయిల్: info@hyderabadhouse.net
వెబ్ సైట్ : www.hyderabadhouse.net


Press release by: Indian Clicks, LLC