Begin typing your search above and press return to search.
ఈసారి గ్రేటర్ ఎన్నికలు.. ప్రత్యేకతల కుప్ప.. ఎలానంటే?
By: Tupaki Desk | 1 Dec 2020 9:15 AM ISTస్థానిక సంస్థలకు ఎన్నికలు వస్తాయి.. పోతాయి. మహా అయితే ఆ ప్రాంతంలోని వారి మధ్య చర్చకు తెర తీస్తుంటాయి. ఈ రోజు పోలింగ్ జరుగుతున్న గ్రేటర్ ఎన్నికల లెక్క వేరుగా చెప్పాలి. రోటీన్ కు భిన్నమైన ఈ ఎన్నికలకు ఉన్న ప్రత్యేకతలు అన్ని ఇన్ని కావు. ప్రత్యక్షంగా కాకున్నా పరోక్షంగా అయినా దేశ ప్రధానమంత్రి ఎన్నికలు జరుగుతున్న నగరానికి కీలకమైన ఎన్నికల ప్రచార సమయంలో వచ్చి వెళ్లటం ఒక విశేషం అయితే.. అధికారంలో ఉన్న ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు స్వయంగా ప్రచారంలో పాలు పంచుకోవటం దేనికి నిదర్శనం?
అంతేకాదు.. గ్రేటర్ ఎన్నికల కోసం దేశంలోని అతి పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న యోగి ఆదిత్యనాథ్ మొదలు కొని ప్రవాహం మాదిరి కేంద్రమంత్రులు హైదరాబాద్ నగరానికి వచ్చి ప్రచారం చేశారు. ఇంత పోటాపోటీగా.. భావోద్వేగంతో స్థానిక ఎన్నికలు జరగటం ఇటీవల కాలంలో ఇదే తొలిసారిగా చెప్పక తప్పదు. ఇక.. గ్రేటర్ ఎన్నికల స్వరూపాన్ని చూస్తే.. మొత్తం 150 డివిజన్లు ఉండగా.. పోటీ చేస్తున్న అభ్యర్థులు 1122 మంది. అంటే.. ఒక డివిజన్ లో సరాసరిన ఎనిమిది మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు.
గ్రేటర్ లోని జంగంమెట్ లో అత్యధికంగా 20 మంది అభ్యర్థులు ఉంటే.. అత్యల్పంగా ముగ్గురు మాత్రమే అభ్యర్థులు బరిలో ఐదు డివిజన్లలో ఉన్నారు. ఉప్పల్.. బార్కస్.. నవాబ్ సాహెబ్ కుంట.. టౌలియౌకి.. జీడిమెట్లలో ఉన్నారు. గతానికి భిన్నంగా కరోనా నేపథ్యంలో ఒక్కో పోలింగ్ కేంద్రంలో వెయ్యి మంది అంతకంటే తక్కువ ఓటర్లతో ఏర్పాట్లు చేశారు. దీంతో.. గతంలో నిర్వహించిన ఎన్నికలతో పోలిస్తే.. పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలు పెరిగాయి. గ్రేటర్ వ్యాప్తంగా 9101 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
గ్రేటర్ పరిధిలోని 150 డివిజన్లలో అత్యధిక పోలింగ్ కేంద్రాలు ఉన్న డివిజన్ గా కొండాపూర్ ను చెప్పాలి. ఈ డివిజన్ లో ఏకంగా 99 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇక.. అతి తక్కువ పోలింగ్ కేంద్రాలు ఉన్న డివిజన్ గా రామచంద్రాపురం నిలిచింది. అక్కడ కేవలం 33 పోలింగ్ కేంద్రాలు మాత్రమే ఉన్నాయి. మొత్తం ఓటర్లు 74.44లక్షల మంది ఉండగా.. అందులో పురుషులు 38,77,688 కాగా.. మహిళా ఓటర్లు 35,65,896 మంది. ఇతరులు 676 ఉన్నారు.
ఈ ఎన్నికల కోసం పోలింగ్ సిబ్బంది 48 వేల మంది పని చేస్తుంటే.. భద్రతా ఏర్పాట్ల కోసం 52 వేల మంది పోలీసుల్ని వినియోగిస్తున్నారు. బ్యాలెట్ బాక్సులు మొత్తం 28,683 కాగా.. బ్యాలెట్ పత్రాలు 81,88,686. ప్రస్తుతం ఉన్న కొవిడ్ నేపథ్యంలో పోలింగ్ ను అదనంగా గంట పొడిగించారు. ఉదయం 7 గంటలకు మొదలయ్యే పోలింగ్.. సాయంత్రం ఆరు గంటల వరకు సాగనుంది. సాయంత్రం ఐదు గంటల దాటిన తర్వాత కొవిడ్ పేషెంట్లను ఓట్లు వేసేందుకు అనుమతిస్తారు. ఈ సందర్భంగా ఓట్లు వేసే వారికే కాదు.. పోలింగ్ సిబ్బంది సైతం పీపీఈ కిట్లు ధరించిన తర్వాత ఓట్లు వేసేందుకు అనుమతి ఇస్తారు.
పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పూర్తి ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. స్థానిక ఎన్నికలు కావటంతో తెల్లరంగుతో బ్యాలెట్ పత్రాన్ని సిద్ధం చేశారు. చాలా రోజుల తర్వాత బ్యాలెట్ పద్దతిలో ఈ ఎన్నికను నిర్వహిస్తున్నారు. బ్యాలెట్ పత్రాన్ని అధికారులు మడిచి ఇచ్చిన తీరులోనే బ్యాలెట్ బాక్సులో వేయాల్సి ఉంటుంది. ఎన్నికల సంఘం నిర్దేశించిన 18 రకాల గుర్తింపు కార్డుల్లో దేనినైనా చూసి ఓటుహక్కును వినియోగించుకునే వీలుంది.
తాజాగా నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల్లో కోవిడ్ బాధితులు.. దివ్యాంగులు.. 80 ఏళ్కలకు పైబడిన పెద్ద వయస్కులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకునే వీలు కల్పించారు. ఓటు వేయటానికి వచ్చిన వారి విషయంలో ఏదైనా అనుమానం ఉంటే.. వెంటనే టెస్టు చేసేలా ఏర్పాట్లుచేశారు. ఎన్నికలు పారదర్శకంగా జరిగేందుకు వీలుగా 2920 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ నిర్వహిస్తున్నారు.ఇందుకోసం 6500 దరఖాస్తులు వచ్చాయి. అంతేకాదు.. ప్రతి డివిజన్ లోనూ ప్రత్యేకంగా ఫేస్ రికగ్నైషన్ విధానం ద్వారా ఓటర్లను అనుమతిస్తారు.