Begin typing your search above and press return to search.

మోడీ క‌న్ఫ‌ర్మ్ చేయ‌కున్నా డేట్ చెప్పిన డిప్యూటీసీఎం

By:  Tupaki Desk   |   4 Nov 2017 2:35 PM GMT
మోడీ క‌న్ఫ‌ర్మ్ చేయ‌కున్నా డేట్ చెప్పిన డిప్యూటీసీఎం
X
హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రానికి మ‌ణిపూస లాంటి హైద‌రాబాద్ మెట్రోరైల్ కు సంబంధించి ఆస‌క్తిక‌ర అంశం ఒక‌టి చోటు చేసుకుంది. దాదాపు రెండు నెల‌ల క్రితం మెట్రో రైల్ ప్రారంభానికి రావాలంటూ ప్ర‌ధాని మోడీకి తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆహ్వాన లేఖ‌ను పంపారు. ఈ విష‌యాన్ని ట్విట్ట‌ర్ లో మంత్రి కేటీఆర్ అంద‌రితో పంచుకున్నారు.

హైద‌రాబాద్ లో జ‌రిగే బిజినెస్ స‌మ్మిట్ కు మోడీ హాజ‌రు కానున్న నేప‌థ్యంలో మెట్రో ప్రారంభాన్ని న‌వంబ‌రు 28-30 చేయాలంటూ లేఖ‌లో విన్న‌వించుకున్నారు. కేసీఆర్ పంపిన లేఖ పీఎంవోకు చేరిన‌ప్ప‌టికీ ఈ రోజు వ‌ర‌కూ ఆ లేఖ‌కు స‌మాధానం రాలేదు. మెట్రో రైల్ ప్రాజెక్టును ప్రారంభించే విష‌యంపై మోడీ క్లారిటీ ఇవ్వ‌లేదు. బిజినెస్ స‌మ్మిట్‌కు 28న హైద‌రాబాద్‌కు వస్తున్న‌ప్ప‌టికీ.. అదే రోజు ప్రారంభానికి మోడీ ఓకేనా? కాదా? అన్న విష‌యంపై స్ప‌ష్ట‌త లేక తెలంగాణ ప్ర‌భుత్వం.. మెట్రోరైల్ అధికారులు కిందామీదా ప‌డుతున్నారు.

అలా అని ఆ విషయాన్ని బ‌య‌ట‌కు చెబితే బాగోదు కాబ‌ట్టి.. గుంభ‌నంగా ఉన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి మ‌హ‌మూద్ అలీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య చేశారు. ప‌ట్ట‌ణ ర‌వాణా వ్య‌వ‌స్థ‌పై హెచ్ఐసీసీలో జ‌రుగుతున్న అంత‌ర్జాతీయ స‌ద‌స్సుకు హాజ‌రైన ఆయ‌న‌.. ఈ నెల 28న మియాపూర్ - నాగోల్ మ‌ధ్య మెట్రో రైలు మార్గాన్ని ప్రారంభించ‌నున్న‌ట్లుగా వెల్ల‌డించారు. ఇప్ప‌టివ‌ర‌కూ పీఎంవో నుంచి ఓకే అన్న మాట రాకున్నా.. డిప్యూటీ ముఖ్య‌మంత్రులు వారు మాత్రం ఏకంగా ప్ర‌క‌ట‌న చేసేయ‌టంపై అధికారులు విస్మ‌యాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.