Begin typing your search above and press return to search.
ఫుల్లీ ఫ్రీ వైఫై సిటీ.. హైదరాబాద్
By: Tupaki Desk | 3 April 2016 12:45 PM ISTహైదరాబాద్ నగరం మొత్తం వైఫై కవరేజిలోకి వచ్చేస్తోంది. అది కూడా ఫ్రీగా... చెప్పేదేముంది, ఫ్రీ వైఫై అంటే జనానికి పండగే మరి. హైదరాబాద్ నగరంలోని అత్యంత కీలకమైన ప్రాంతాల్లో ఉచిత వైఫై సేవలను ప్రజలు వినియోగించుకునేలా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే సుమారు 200 ప్రాంతాల్లో ఉచిత వైఫై సేవలను అమల్లో ఉన్నాయి. ఈ సేవలను ఇప్పచి వరకు దాదాపుగా 21వేల మంది వినియోగించుకున్నారు. అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధి విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలకు వైఫై సేవల వినియోగం కూడా బాగా పెరిగింది. అలాగే ప్రభుత్వ శాఖల మధ్య సత్వరం సమన్వయం చేసుకునేందుకు సైతం వైఫై సేవలు ఎంతగానే ఉపయోగపడుతున్నాయి. దీంతో మరో 3 వేల ఉచిత వైఫై కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ప్రస్తుతం అందిస్తున్న ఉచిత వైఫై కేంద్రాలను 200 నుంచి 3వేల వరకు పెంచాలని నిర్ణయించారు. హైదరాబాద్ లో ఇప్పటికే పలు సేవలు ఆన్ లైనయ్యాయి. అంతేకాకుండా అన్నిటికీ యాప్ లు అందుబాటులోకి తెచ్చారు. రవాణా శాఖ సేవలనూ యాప్ ల్లో అందుబాటులోకి తెచ్చారు. ట్రాఫిక్ పోలీసులు ఆపితే లైసెన్సు - సీ బుక్ వంటివి చూపించే అవసరం లేకుండా యాప్ లో పొందుపరిచినవాటిని చూపిస్తే సరిపోయేలా యాప్ లు తీసుకొచ్చారు. అలాగే పలు ఇతర సేవలకూ యాప్ లు తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ప్రజల సౌకర్యార్థం, పాలనలో సౌలభ్యార్థ్యం ఉచిత వైఫై జోన్లను భారీగా విస్తరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇది పూర్తయితే దేశంలో ఫ్రీ వైఫై ఎక్కువగా ఉన్న నగరంగా హైదరాబాద్ అవతరించబోతోంది.