Begin typing your search above and press return to search.

హైదరాబాద్ డాక్టర్ కిడ్నాప్ కథ సుఖాంతం

By:  Tupaki Desk   |   28 Oct 2020 12:00 PM IST
హైదరాబాద్ డాక్టర్ కిడ్నాప్ కథ సుఖాంతం
X
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ డాక్టర్ కిడ్నాప్ కావడం కలకలం సృష్టించింది. గుర్తుతెలియని కొందరు దుండగులు బుర్ఖా వేసుకొని వచ్చి మరీ డాక్టర్‌ డాక్టర్ బెహజాట్ హుసేన్ ను కిడ్నాప్ చేశారు. అయితే , కిడ్నాప్ చేసిన డాక్టర్ ను బెంగళూరు, షిమోగా వైపు తరలిస్తుండగా అనంతరపురం వద్ద ఏపీ పోలీసులు బాధితుడిని కిడ్నాపర్ల నుండి కాపాడారు. రాప్తాడు సమీపంలో పోలీసులు కిడ్నాపర్లు ఉన్న వాహనాన్ని గుర్తించి , కిడ్నాప్ అయిన డాక్టర్ ను రక్షించారు. అలాగే , ఆ వాహనంలో మరో ఇద్దరు కిడ్నాపర్లను కూడా అదుపులోకి తీసుకున్నట్టు అనంతపురం పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు.

హిమాయత్‌సాగర్ దర్గా సమీపంలో ఉన్న డెంటిస్ట్ డాక్టర్ బెహజాట్ హుస్సేన్‌ను బురఖాలో వచ్చిన దుండగులు అతడి కారులోనే కిడ్నాప్ చేశారు. దీంతో ఆందోళనకు గురైన వైద్యుడి కుటుంబసభ్యులు రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డాక్టర్ కారు నెంబర్ ఏపీ 9వై 0031గా కుటుంబసభ్యులు తెలిపారు. దీనితో వెంటనే బాధిత డాక్టర్ కుటుంబీకులు రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనితో వెంటనే అలెర్ట్ అయిన పోలీసులు కిడ్నాప్ కి గురైన స్థలాన్ని పరిశీలించి , కుటుంబ సభ్యుల వద్ద వాంగ్మూలం తీసుకున్నారు. సీపీ సజ్జనార్ స్వయంగా డాక్టర్ కిడ్నాప్ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు.

ఈ కేసుకు సంబంధించి ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం మొదటగా సీసీటీవీ పుటేజ్ ఆధారంగా కేసును దర్యాప్తు మొదలుపెట్టి కూపీ లాగారు. ఆ ఆధారంగా కిడ్నాప్ చేసిన ప్రాంతం నుండి డాక్టర్ ను ఓ రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి , అక్కడ మరో నలుగురు ఉన్న బృందానికి బాధితుడిని అప్పగించిన తర్వాత బొలోరో వాహనంలో తరలిస్తుండగా తెలంగాణా పోలీసుల నుంచి సమాచారం అందుకున్న అనంతపురం పోలీసులు రంగంలో దిగిన అనంతపురం పోలీసులు రాప్తాడు సమీపంలో బాధితుడిని కిడ్నాపర్ల నుండి కాపాడారు.

ఇకపోతే , హైదరాబాద్ లోని కిస్మత్ ‌పురాలో డాక్టర్ హుస్సేన్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారని పోలీసులు వెల్లడించారు. ప్రతిష్టాత్మక రాయల్ వుడ్స్ విల్లాల అమ్మకందారుడు కావడంతో భారీ మొత్తంలో డబ్బు డిమాండ్ చేయచ్చు అన్న కోణం లో అలోచించి ఆయన్ని కిడ్నాప్ చేశారని తెలిపారు. కిడ్నాపర్లు రూ. 10 కోట్లు డిమాండ్ చేసినట్టు కూడా వెల్లడించారు. దీనితో బాధితుడిని విడిపించేందుకు వేగంగా అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి కాళ్లు, చేతులు కట్టేసి కారులో పడి ఉన్న బాధితుడిని కాపాడినట్టు తెలిపారు.ఒకరిని అదుపులోకి తీసుకోగా మరో నలుగురు ముఠా సభ్యులు పరారీలో ఉన్నట్టు వెల్లడించారు. కిడ్నాపర్‌ నుంచి రివాల్వర్, కత్తి, మత్తు ఇంజక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. కర్నాటకకు చెందిన కిడ్నాప్‌ గ్యాంగ్‌గా అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు పరారైనవారికోసం గాలింపు చర్యలు చేపట్టారు.