Begin typing your search above and press return to search.

హైదరాబాద్ కరోనా బాధితుడి చెప్పిన నిజాలివీ

By:  Tupaki Desk   |   27 March 2020 2:30 AM GMT
హైదరాబాద్ కరోనా బాధితుడి చెప్పిన నిజాలివీ
X
ఇటీవలే బ్రిటన్ నుంచి ఇండియాకు వచ్చి ఓ హైదరాబాద్ యువకుడికి కరోనా పాజిటివ్ సోకింది. ప్రస్తుతం అతడు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సందర్భంగా బాధితుడు చెప్పిన విషయాలు వైరల్ గా మారాయి. తన సోషల్ మీడియా ఖాతాలో అతడు కరోనా వ్యాధి గురించి లూప్ హోల్స్ గురించి వివరంగా వెల్లడించాడు.

విదేశాల నుంచి వచ్చే వారు తమ శరీర ఉష్ణోగ్రతను ప్యారసిటమాల్ టాబ్లెట్ వేసుకొని తగ్గించుకొని తప్పించుకుంటున్నారని బాధితుడు సంచలన విషయం వెల్లడించారు. క్వారంటైన్ లో ఉండాల్సి వస్తుందని.. విమానంలోనే ప్యారసిటమాల్ వేసుకొని ఎయిర్ పోర్టు చెకింగ్ లో తప్పించుకుంటున్నారని.. వారి వల్లే కరోనా వ్యాధి ఇతరులకు వ్యాపిస్తోందని అన్నారు.

కరోనా సోకితే అసలు వైరస్ లక్షణాలు కనిపించవని.. అయితే రోగం మనిషిని మెల్లిగా కబళిస్తుందని బాధితుడు తెలిపారు. లక్షణాలు లేవని చికిత్స తీసుకోకపోతే ప్రాణాలు పోతాయన్నారు. శరీరంలోని రోగ నిరోధక శక్తిని ఈ వైరస్ నెమ్మదిగా బలహీన పరుస్తుందని.. మానసికంగా దృఢంగా ఉంటేనే వైరస్ ను జయించగలమన్నారు.

విమానాశ్రయంలో తనకు థర్మల్ టెస్ట్ లో వైరస్ బయటపడలేదని.. కానీ తర్వాత వచ్చిందని బాధితుడు తెలిపాడు. విమానాశ్రయం లో అసలు తనకు వైరస్ లేదని తేలినా తాను స్వీయ నియంత్రణ పాటించి తన కుటుంబ సభ్యులకు సోకకుండా చూసుకున్నానని తెలిపాడు.

వైరస్ లేదని బయట తిరిగే వారు వారికి తెలియకుండానే చనిపోతారని... ఇది వారి ద్వారా వందలాది మందికి పాకి అందరికీ ప్రాణాపాయం ఏర్పడుతుందని బాధితుడు వివరించాడు. ముందుగా గుర్తించి చికిత్స తీసుకుంటేనే వైరస్ ను అదుపు చేయగలమని తెలిపారు.