Begin typing your search above and press return to search.
బ్రేకింగ్: హైదరాబాద్-బెంగళూరు రాకపోకలు బంద్
By: Tupaki Desk | 14 Oct 2020 3:00 PM ISTవర్ష బీభత్సం కొనసాగుతోంది. తీరం దాటిన తుఫాన్ ఆంధ్రా, తెలంగాణపై ప్రభావం చూపుతోంది. దీంతో భారీవర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ ను వాన ముంచెత్తుతోంది.
హైదరాబాద్ లో నిన్న కురిసిన భారీ వర్షాలకు చాలా ప్రాంతాల్లో రోడ్లపై నీళ్లు నిలిచిపోవడంతో పాటు పలు ప్రాంతాల్లో రోడ్లు కూడా కొట్టుకుపోయాయి. జంట నగరాల్లో దాదాపు 1500 కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి.
వరద ఉధృతికి హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారి కొట్టుకుపోయింది. గగన్‌పహాడ్ సమీపంలోని అప్పా చెరువు కట్ట తెగి జాతీయ రహదారిపై వరదనీరు చేరడంతో రహదారి ధ్వంసమైంది.ఈ మార్గాన్ని ఇరువైపులా పోలీసులు మూసివేశారు.
ఈ ఘటనలో రహదారిపై వెళ్తున్న వాహనాలు వరదనీటిలో కొట్టుకుపోయాయి. దాదాపు 30 మంది గల్లంతైనట్లు సమాచారం. ఇప్పటి వరకు ముగ్గురి మృతదేహాలను బయటకు తీశారు.
ఇక ఎయిర్ పోర్టు, బెంగళూరుకు వెళ్లే ప్రయాణికులు, బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చే ప్రయాణికులు ప్రత్యామ్మాయ మార్గాల్లో రావాలని.. ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా నగరంలోకి ప్రవేశించాలని అధికారులు సూచిస్తున్నారు