Begin typing your search above and press return to search.

ఓఎల్ఎక్స్ సైట్ నిషేధంపై కేంద్రానికి పోలీసుల లేఖ

By:  Tupaki Desk   |   14 July 2020 12:30 PM GMT
ఓఎల్ఎక్స్ సైట్ నిషేధంపై కేంద్రానికి పోలీసుల లేఖ
X
పాతది ఏదైనా ఈజీగా అమ్మేయడానికా ఉన్న ప్లాట్ ఫాం ఓఎల్ఎక్స్. ఇందులో అమ్మాలు.. కొనుగోలు జరుగుతుంటాయి. ఎంతో సదుద్దేశంతో ఏర్పాటుచేసిన ఈ సైట్ లో కొన్ని అవకాశాలను నేరస్తులు పట్టుకుని వాటి ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. సైబర్ నేరగాళ్ల బారిన పెద్దసంఖ్యలో ప్రజలు పడుతుండడంతో పోలీసులు ఆ సైట్ నే నిషేధించాలని కోరుతున్నారు. ఈ మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు ఈ సైట్ ను బ్యాన్ చేయాలంటూ ఏకంగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.

ఈ ఓఎల్ఎక్స్ సైట్ అమ్మకాలు-కొనుగోళ్లు చేయొద్దని స్వయంగా సైబర్ క్రైమ్ పోలీసులే చెబుతున్నారు. ఈ సైట్ కు దూరంగా ఉండాలని సూచిస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఈ సైట్ వలన ఒక్క హైదరాబాద్ పరిధిలోనే రోజుకు 10కి పైగా మోసాలు జరుగుతున్నాయి. వీటిపై కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో సైట్ ను నిషేధించాలని పోలీసులు కోరుతున్నారు.

ఓఎల్ఎక్స్ లో మోసాలు ఇలా జరుగుతున్నాయి. ఆన్ లైన్ వాడకం నుంచి మోసాలు అధికమయ్యాయి. ఆన్ లైన్ లొసుగులను వినియోగించుకుని దుండగులు మోసాలు చేస్తున్నారు. ఓ క్యూఆర్ కోడ్ పంపించి దాన్ని స్కాన్ చేస్తే మీ ఎకౌంట్ లోకి డబ్బులు పడతాయని, మీ ఎకౌంట్ లో డబ్బులు పడిన వెంటనే ఇంటికొచ్చి వస్తువు తీసుకెళ్తామని చెబుతారు. అయితే ముందే డబ్బులు వస్తున్నాయనే ఆశతో చాలామంది ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నారు. ఇలా చేయడంతో బ్యాంకు ఖాతాలో డబ్బులు పడకపోగా మన ఖాతాలో ఉన్న డబ్బులు మాయమవుతున్నొయి. ఇలాంటి మోసాలు పెద్ద సంఖ్యలో జరుగుతుండడం పోలీసులకు తలనొప్పిగా మారింది. ఆన్ లైన్ మోసాలపై ఎంత అవగాహన కల్పించినా ప్రజలు వినడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఏకంగా ఆ సైట్ ను నిషేధించాలని పోలీసులు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.