Begin typing your search above and press return to search.

అందరికి కనిపించేలా ఫ్యాంట్ వెనుక పిస్టల్.. గులాబీ నేత హల్ చల్

By:  Tupaki Desk   |   15 Sept 2022 10:35 AM IST
అందరికి కనిపించేలా ఫ్యాంట్ వెనుక పిస్టల్.. గులాబీ నేత హల్ చల్
X
కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన ఒక టీఆర్ఎస్ నేత చేస్తున్న హడావుడికి చెందిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హడావుడి చేస్తోంది. ఇంతకీ ఈ ఛోటా నేత అంత పేరు ప్రఖ్యాతులున్న వ్యక్తి ఏమీ కాదు. మరింత స్పష్టంగా చెప్పాలంటే అతగాడు మహిళా ఎంపీపీ భర్త.

అయితే.. అతనికి గన్ లైసెన్సు ఎలా వచ్చిందో తెలీదు కానీ.. దాన్ని ఫ్యాంట్ వెనుక దోపి.. అందరికి కనిపించేలా హడావుడి చేస్తున్న వైనంపై విమర్శలు వెల్లువెత్తాయి. అదే సమయంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ర మాట్లాడుతూ.. తన నియోజకవర్గంలోని పలువురికి గన్ లైసెన్సులు ఇస్తున్నారంటూ మండిపడ్డారు.

ఈటల నోటి నుంచి గన్ ఆరోపణలు వచ్చిన తర్వాత.. సోషల్ మీడియాలో సదరు టీఆర్ఎస్ నేత గన్ పెట్టుకున్న విషయం అందరికి తెలిసేలా ఉన్న ఫోటో వైరల్ బయటకువచ్చి వైరల్ కావటం హాట్ టాపిక్ గా మారింది.దీంతో.. ఈ అంశంపై కరీంనగర్ పోలీసు కమిషనర్ ప్రత్యేకంగా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

హుజూరాబాద్ నియోజకవర్గం పరిధిలో విచ్చల విడిగా గన్ లైసెన్సులు ఇస్తున్నారన్నది అబద్ధమని చెప్పారు.

గడిచిన రెండేళ్లలో హుజూరాబాద్ నియోజకవర్గం పరిధిలో ఇద్దరికి మాత్రమే గన్ లైసెన్సులు జారీ చేసినట్లుగా చెప్పారు. అందరికి కనిపించేలా గన్ పెట్టుకొని తిరుగుతున్న టీఆర్ఎస్ నాయకుడ్ని తాము హెచ్చరించామని.. నిబంధనల ప్రకారం గన్ లైసెన్సు ఉన్నప్పటికీ.. ఆయుధాన్ని అందరికి కనిపించేలా ప్రదర్శించకూడదన్న విషయాన్ని స్పష్టం చేసినట్లు చెప్పారు.

అంతేకాదు.. ఇదే రీతిలో మరోసారి గన్ అందరికి కనిపించేలా ప్రదర్శిస్తే.. లైసెన్సు రద్దు చేస్తామని సీపీ స్పష్టం చేశారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.