Begin typing your search above and press return to search.

హుజూరాబాద్‌ లో ముక్కోణ‌పు పోరు.. ఎవ‌రికి దెబ్బో ?

By:  Tupaki Desk   |   25 Jun 2021 5:30 AM GMT
హుజూరాబాద్‌ లో ముక్కోణ‌పు పోరు.. ఎవ‌రికి దెబ్బో ?
X
మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ రాజీనామాతో హుజూరాబాద్‌కు త్వ‌ర‌లోనే ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. ఈ ఉప ఎన్నిక‌ల్లో ఇప్ప‌టి వ‌ర‌కు టీఆర్ఎస్ నుంచి రాజ‌కీయాలు చేసిన ఈట‌ల బీజేపీ అభ్య‌ర్థిగా రంగంలో ఉండ‌నున్నారు. ఇక కాంగ్రెస్ అభ్య‌ర్థిగా ఎలాంటి సంచ‌ల‌నాలు లేక‌పోతే ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి స‌మీప బంధువు, ప్రస్తుత నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ పాడి కౌశిక్ రెడ్డే పోటీలో ఉండే ఛాన్సులు ఉన్నాయి. ఇక అధికార టీఆర్ఎస్ నుంచి ఎవ‌రు పోటీలో ఉంటార‌న్న‌దానిపై క్లారిటీ అయితే లేదు. ఇప్ప‌టికే ప‌ది మంది పేర్ల‌తో కూడిన జాబితా అయితే కేసీఆర్ ద‌గ్గ‌ర ఉంది. కేసీఆర్ ఈ ప‌ది మంది నుంచే టీఆర్ఎస్ అభ్య‌ర్థిని ఎంపిక చేస్తారా ? లేదా కొత్త వారికి ఛాన్స్ ఇస్తారా ? అన్న‌ది చూడాలి.

అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఇక్క‌డ కేవ‌లం ద్విముఖ పోరు మాత్ర‌మే ఉంటుంద‌నుకున్న వారి అంచ‌నాల‌కు భిన్న‌మైన వాతావ‌ర‌ణం నెల‌కొంది. హుజూరాబాద్‌లో త్రిముఖ పోరు త‌ప్పేలా లేదు. ఈట‌ల‌కు అక్క‌డ ఉన్న బ‌లమే ఇప్పుడు అక్క‌డ బీజేపీకి ప్ల‌స్ అవుతోంది. వాస్త‌వంగా చూస్తే అక్క‌డ బీజేపీ బలం జీరో. నాగార్జునా సాగ‌ర్‌లో బీజేపీ ఎంత దారుణంగా ఓట్లు రాబ‌ట్టుకుందో హుజూరాబాద్‌లోనూ ఆ పార్టీ ప‌రిస్థితి అంత‌కు మించి ఉండ‌దు. అయితే ఈట‌ల పార్టీలోకి రావ‌డ‌మే అక్క‌డ బీజేపీకి చాలా ప్ల‌స్‌.

ఇక కాంగ్రెస్ ఇన్‌చార్జ్ గా ఉన్న కౌశిక్ రెడ్డికి నియోజ‌క‌వ‌ర్గంలో బ‌ల‌మైన బంధుగ‌ణంతో పాటు రెడ్డి సామాజిక వ‌ర్గంలో ప‌ట్టుంది. ఈట‌ల‌పై కొన్నేళ్లుగా ఓ వ‌ర్గంలో ఉన్న వ్య‌తిరేక‌త నేప‌థ్యంలో వారంతా కౌశిక్ రెడ్డికి ముందు నుంచి స‌పోర్ట్ చేస్తూ వ‌స్తున్నారు. ఇక కౌశిక్ ముందు నుంచి ఈట‌ల‌కు బ‌ల‌మైన వ్య‌తిరేక వాదిగా ముద్ర‌ప‌డ్డారు. అందుకే తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో ఈట‌ల‌తో విబేధించే వారంద‌రూ ఆయ‌న వెన‌క ఉన్నారు. అయితే ఇప్పుడు అక్క‌డ ఓ వ‌ర్గంలో కౌశిక్ ఉన్న ప‌ట్టు నేప‌థ్యంలో కాంగ్రెస్ కూడా గ‌ట్టి పోటీదారే..!

ఇక టీఆర్ఎస్‌కు అక్క‌డ బ‌లం ఉన్న మాట వాస్త‌వ‌మే. అయితే ఇప్పుడు ఈట‌ల లాంటి బ‌ల‌మైన నాయ‌కుడు లేక‌పోతే గ‌తంలోలా ఘ‌న‌విజ‌యమే న‌మోదు చేస్తుందా ? లేదా కాంగ్రెస్ కూడా స్ట్రాంగ్‌గా ఉంటే ఏం చేస్తుంది ? అన్న‌ది మాత్రం అప్పుడే అంచ‌నాకు రాలేం.. అయితే ఒక్క‌టి మాత్రం నిజం. హుజూర్‌న‌గ‌ర్‌, నాగార్జునా సాగ‌ర్‌లా ఇక్క‌డ ద్విముఖ పోటీ అయితే ఉండ‌దు. మ‌రి త్రిముఖ పోటీలో ఎవ‌రి కొంప ఎవ‌రు కొల్లేరు చేస్తారో ? ఫ‌లితాలే చెప్పాలి.. లేదా అచంనాల‌కు కొద్ది రోజులు వెయిట్ చేయాలి.