Begin typing your search above and press return to search.

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో నిరుద్యోగులు

By:  Tupaki Desk   |   21 Aug 2021 11:20 AM IST
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో నిరుద్యోగులు
X
తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మాజీ మంత్రి, టీఆర్ఎస్ నుంచి వీడిన ఈటల రాజేందర్ ను ఓడించడమే ధ్యేయంగా ముందుకెళుతున్నారు. అయితే అటు పక్క ఈటల రాజేందర్ బలంగా ఉన్నాడు. నియోజకవర్గంలో వీరోచితంగా పోరాడుతున్నారు.

కేసీఆర్ దళితబంధు సహా ఎన్నో పథకాలను హుజూరాబాద్ లో కుమ్మరిస్తూ టీఆర్ఎస్ గెలుపునకు బాటలు వేస్తున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో నిరుద్యోగులు పోటీచేయాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తెలిపింది.

రాష్ట్రంలో నిరుద్యోగులు వందల సంఖ్యలో చనిపోతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తోందని వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. నోటిఫికేషన్లు జారీ చేయడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారన్నారు. రేపు, మాపు అంటూ నిరుద్యోగులను మభ్య పెడుతున్నారని ఆరోపించారు.

యువత వయసు దాటిపోతున్నా తెలంగాణ సర్కార్ పట్టించుకోవడం లేదన్నారు. నిరుద్యోగులు కేసీఆర్ కు గుణపాఠం చెప్పాలంటే వచ్చే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో వందల సంఖ్యలో నామినేషన్లు వేయాలని వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. కేసీఆర్ మెడలు వంచేలా నిరుద్యోగులతో నామినేషన్లు వేయించాలని వైఎస్ఆర్ టీపీ నిర్ణయించింది.

ఇక నుంచి నిరుద్యోగుల పక్షాన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పోరాటం మరింత ఉధృతం చేస్తుందన్నారు. పూర్తి స్థాయిలో ఉద్యోగాలు భర్తీ చేసే వరకూ యువత పక్షాన నిలబడుతామని పేర్కొన్నారు.