Begin typing your search above and press return to search.

కమ్యూనిస్టుల చెంతకు కేసీఆర్.. ఏంటి స్థితి?

By:  Tupaki Desk   |   29 Sep 2019 10:58 AM GMT
కమ్యూనిస్టుల చెంతకు కేసీఆర్.. ఏంటి స్థితి?
X
తెలంగాణలో ఎదురులేని పార్టీ టీఆర్ ఎస్. ఇక కేసీఆర్ కంటే బలమైన నేతలు లేరు. అలాంటి గులాబీ పార్టీ హుజూర్ నగర్ లో గెలుపు కోసం డిఫెన్స్ పడిపోవడం రాజకీయంగా షాకింగ్ లా మారింది. తెలంగాణలో తిరుగులేని శక్తి అని చెప్పుకుంటున్న గులాబీ పార్టీ ఏకంగా కమ్యూనిస్టుల సాయం కోరడం రాజకీయంగా సంచలనంగా మారింది.

తెలంగాణలో గడిచిన రెండు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ ఎస్ ఒంటరిగా పోటీచేసింది.. గెలిచింది. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో తప్పితే గులాబీ పార్టీ స్పష్టమైన ఆధిక్యతను కనబరించింది. అలాంటి గులాబీ పార్టీ ఇప్పుడు హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం కమ్యూనిస్టు పార్టీ ‘సీపీఐ’ మద్దతు కోరడం హాట్ టాపిక్ గా మారింది.

తాజాగా ఆదివారం సీపీఐ రాష్ట్ర కార్యాలయానికి టీఆర్ ఎస్ నేతల బృందం వెళ్లారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని టీఆర్ ఎస్ నేతలు కే కేశవరావు - ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు - రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బి. వినోద్ కుమార్ లు సీపీఐ నేతలతో భేటి అయ్యారు. హుజూర్ నగర్ లో టీఆర్ ఎస్ కు మద్దతు ఇవ్వాలని కోరారు. దీనిపై చర్చించి నిర్ణయం చెబుతామని సీపీఐ బదులిచ్చింది.

2018 డిసెంబర్ 7న జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో సీపీఐ - కాంగ్రెస్ - టీజేఎస్ - టీడీపీలు కలిసి పోటీచేశాయి. సీపీఐ హుజూర్ నగర్ లో పోటీ విషయంపై నిర్ణయం తీసుకోలేదు. దీంతో తమకు మద్దతు ఇవ్వాలని కేసీఆర్ సీపీఐ నేతలను కోరారన్నమాట.. ఓటమి భయంతోనే సీపీఐ మద్దతును టీఆర్ ఎస్ తీసుకుంటోందని కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కమ్యూనిస్టులను అవమానించిన కేసీఆర్ కు మద్దతు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.