Begin typing your search above and press return to search.

భార్యలపై మగాళ్ల నిఘా.. పడకగదిలో సీసీ, స్పై కెమెరాలు

By:  Tupaki Desk   |   23 Dec 2020 2:30 AM GMT
భార్యలపై మగాళ్ల నిఘా.. పడకగదిలో సీసీ, స్పై కెమెరాలు
X
పడక గది. ఆ గదిలో ఎవరూ ఉండరు. కానీ కొన్ని కళ్లు మిమ్మల్ని, మీ కదలికల్ని రహస్యంగా గమనిస్తుంటాయి.. ఒకప్పుడు ఎక్కడైనా ఏదైనా నేరం జరిగితే నిందితులను గుర్తించి పట్టుకోవడం చాలా కష్టమయ్యేది. సాంకేతికత పెరిగిన తర్వాత ఎక్కడ ఎలాంటి నేరాలు జరిగినా... ఇట్టే పట్టేసుకోవడం జరుగుతోంది. అయితే నేరస్తులను పట్టుకుంటున్నది పోలీసులే అయినా.. వారిని గుర్తించడంలో మాత్రం సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అందుకే ఇప్పటి వరకు నగరాలకే పరిమితమైన సీసీ కెమెరాలు ఇప్పుడు గ్రామాల్లో కూడా దర్శనమిస్తున్నాయి. కొందరైతే ఇంటి వద్ద కూడా భద్రతాపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకొని అక్కడ కూడా సీసీ కెమెరాలు ఫిక్స్ చేసుకుంటున్నారు. కానీ కొందరూ భర్తలు మాత్రం ఇళ్లంతా సీసీ కెమెరాలే బిగిస్తున్నారు. ఇళ్లంతా అంటే బెడ్రూమ్‌తో సహా ఫిక్స్ చేస్తున్నారు.

ఈ మధ్య భార్యలపై భర్తలకు అనుమానాలు పెరిగిపోతున్నాయి. భర్త ఆఫీస్ కు వెళ్లగానే భార్యలు ఏవేవో చేస్తున్నారు. దీంతో భర్తలు కొన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. భార్యలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటున్నారు.

పెరుగుతున్న టెక్నాలజీ పుణ్యమా అని సీసీ కెమెరాలు, స్పై కెమెరాలు, జీపీఎస్ లు అందుబాటులోకి వచ్చాయి. వీటివల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో, అన్నే ఇబ్బందులూ ఉన్నాయి. భార్యపై అనుమానం పెంచుకుంటున్న భర్తలు స్పై, సీసీ కెమెరాలనే సాక్షులుగా వాడుకుంటున్నారు. భర్తలకు ఇప్పుడు ఇవే కెమెరాలకు అస్త్రాలుగా మారాయి. భార్యల గుట్టు రట్టు అవుతుంది.

చాలా మంది అనుకుంటున్నట్లు స్పై కెమెరా చూడడానికి కెమెరా మాదిరిగా ఉండదు. మనకు ఏ మాత్రం అనుమానం రాకుండా రకరకాల మామూలు వస్తువుల రూపంలో స్పై కెమెరాలను తయారుచేస్తారు. స్పై కెమెరాల ద్వారా మహిళల నగ్న దృశ్యాలను రికార్డ్‌ చేసి, వాటిని పోర్న్‌ సైట్లలో అప్‌లోడ్‌ చేస్తున్న వారు ఈ మధ్యకాలంలో ఎక్కువవుతున్నారు. మరికొంతమంది ఆ వీడియోలను ఆ మహిళలకు పంపించి బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు. మరికొంతమంది ఇలాంటి కంటెంట్‌ షేర్‌ చేసుకోవడానికి ప్రత్యేకంగా వాట్సప్‌, ఫేస్‌బుక్‌ గ్రూపులు నిర్వహిస్తున్నారంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు.