Begin typing your search above and press return to search.

భర్తలు వేధిస్తే క్వారంటైన్ కే..!

By:  Tupaki Desk   |   17 April 2020 3:20 PM GMT
భర్తలు వేధిస్తే క్వారంటైన్ కే..!
X
సాధారణంగా ఎవరి ఉద్యోగంలో వారు బిజీగా ఉండేవారు. కరోనా కారణంగా చిన్నా పెద్ద అన్న తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు ఖాళీగా ఉన్నారు. ఇంట్లోనే కాలక్షేపం. గడప దాటే అవకాశమే లేదు. పోయినా కూరగాయలకు ఒక అరగంట. కోవిడ్ కు ముందరి కాళ్ల బంధం వేయడానికి ప్రధాని మోడీ పెట్టిన ఈ లాక్ డౌన్ సమయంలో ఒక ఊహించని సమస్య దేశ వ్యాప్తంగా తలెత్తింది. కొందరు భర్తల నుంచి భార్యలకు వేధింపులు ఎదురవుతున్నాయి. గతంతో పోలిస్తే ఈ కంప్లయింట్లు ఇపుడు రెట్టింపు కట్టే ఎక్కువ వస్తున్నాయట. దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి.

అయితే... దీనిని కొన్ని రాష్ట్రాలు చాలా సీరియస్ గా పరిగణించాయి. కేరళ రాష్ట్రం ఇలాంటి వేధింపులపై ఫిర్యాదు చేయడానికి ప్రత్యేక వాట్సప్ నెంబరు కేటాయించి విస్తృతంగా ప్రచారం చేసింది. దీంతో చాలామందికి ఊరట లభించింది. అలాగే మహారాష్ట్ర కూడా స్పందించింది. అయితే, కేరళతో పోలిస్తే మహారాష్ట్ర చాలా క్రియేటివ్ గా స్పందించింది. గృహహింస కేసులను డీల్ చేయడానికి పుణె పోలీసులు ఒక వెరైటీ వార్నింగ్ ఇచ్చారు. తమ భార్యలను వేధించే భర్తలను తీసుకెళ్లి క్వారంటైన్లో పెడతామని... హెచ్చరించారు. అయితే, కంప్లయింట్ వచ్చిన వెంటనే ఇలా చేయరు. ముందు కౌన్సెలింగ్ ఇస్తారు. అయినా మారకపోతే అపుడు క్వారంటైన్ కి తరలిస్తారు. ఐడియా బాగుంది. ఆ క్వారంటైన్ లో ఉండటంతో కంటే ఇంట్లోనే బెటర్ అనుకుంటున్నారు భర్తలు.

లాక్ డౌన్ కాలంలో కంప్లయింట్లు వస్తున్న కొత్త రకం హింస ఏంటో తెలుసా... అందరూ ఇంట్లోనే ఉండటం వల్ల రకరకాల చిరుతిళ్ల కోసం పదేపదే కాఫీ టీల కోసం నిమిషం తీరిక లేకుండా పని పెడుతున్నారట. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి 10 దాకా విపరీతమైన పని ఒత్తిడి ఉంటుంది... దీనిని భరించలేకపోతున్నాం అని కొత్తరకం కంప్లయిట్లు వస్తున్నాయట. వాస్తవానికి మహారాష్ట్ర పోలీసుల ఐడియా ఇలాంటి వారిని టార్గెట్ చేసిందే.

ఈ సమస్య దేశ వ్యాప్తంగా పెళ్లాలకే కాదు - పిల్లలకు ఉంది. మార్చి 20-31 వరకు 3 లక్షల చైల్డ్ అబ్యూజ్ కాల్స్ వచ్చాయట. అంటే పిల్లలపై వేధింపులు ఇంకా తీవ్రంగా ఉన్నాయి. నిర్బయ ఫండ్ కింద 112 అనే హెల్ప్ లైన్ ని మహిళల నుంచి కంప్లయింట్ల కోసం కేంద్రం ఏర్పాటుచేసింది. పిల్లలు - మహిళలపై వేధింపుల ఫిర్యాదుకే ఈ నెంబరు పనిచేస్తుంది. నేషనల్ విమెన్ కమిషన్ కూడా 7217735372 వాట్సప్ నెంబరు ఇలాంటి కంప్లయింట్ల కోసమే కేటాయించింది.