Begin typing your search above and press return to search.

లాక్ డౌన్ ఎఫెక్ట్ :సింగపూర్‌ లో భర్త అంత్యక్రియలు..భార్యకు వాట్సప్‌ లో ఫొటోలు!

By:  Tupaki Desk   |   8 April 2020 11:36 AM GMT
లాక్ డౌన్ ఎఫెక్ట్ :సింగపూర్‌ లో భర్త అంత్యక్రియలు..భార్యకు వాట్సప్‌ లో ఫొటోలు!
X
కరోనా వైరస్‌ ను కట్టడి చేసేందుకు ప్రపంచంలోని మెజారిటీ దేశాలు లాక్‌ డౌన్‌ ను విధించడంతో పాటు అంతర్జాతీయ విమాన సర్వీసులను పూర్తిగా రద్దు చేశాయి. ఈ మహమ్మారి కారణంగా ఇప్పటికే ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. ముఖ్యంగా ఉద్యోగం - ఉపాధి కోసం వివిధ దేశాలకు వెళ్లిన భారతీయులు - స్వదేశానికి రావడానికి విమానాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. తమ వారి క్షేమ సమాచారం కోసం మనదేశంలో ఉన్న వారి కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు.

ఇక ఇదే సమయంలో కానీ దేశంలో మరణించిన వారి భాద అయితే వర్ణనాతీతం. అచ్చం అలాంటి పరిస్ధితినే ఎదుర్కొంటోంది విశాఖకు చెందిన ఓ కుటుంబం. విశాఖ జిల్లాలోని ఎస్.రాయవరం మండలం వమ్మవరం గ్రామానికి చెందిన వెలుగుల సూర్యారావు ఉపాది కోసం సింగపూర్‌ కు వెళ్లి - అక్కడ వెల్డర్‌ గా పనిచేస్తున్నాడు. అయితే , కుటుంబ పోషణ కోసం సింగపూర్ వెళ్లిన అతడు అక్కడే మృతిచెందినట్టు .. ఆయన పనిచేస్తున్న కంపెనీ ప్రతినిధి ఒకరు అతని భార్య శ్రావణికి సమాచారం అందించారు. భర్త మరణవార్త విన్న ఆమె కుప్పకూలిపోయింది. తన భర్త ఎలా చనిపోయాడో కూడా తెలియదని - ప్రమాదమా.? లేక మరేదైనా కారణమా అనేది కంపెనీ చెప్పలేదని శ్రావణి తెలిపారు.

అయితే , ఇదే సమయంలో కరోనా కారణంగా అన్ని దేశాలు కూడా లాక్ డౌన్ అమల్లో ఉండటంతో శవాన్ని ఇక్కడికి తీసుకురావాలన్న కూడా విమానాలు లేకపోవడం తో అక్కడ వున్న సూర్యారావు స్నేహితులు - సిబ్బంది - తెలుగు అసోసియేషన్‌ ప్రతినిధులు సోమవారం అంత్యక్రియలు నిర్వహించి ఆ వీడియో - ఫొటోలు తమకు పంపారని శ్రావణి చెప్పారు. కుటుంబ పోషణ కోసం సింగపూర్ వెళ్లిన తన భర్త చూపు కూడా దక్కలేదని ఆమె రోదిస్తుంటే ఆపడం ఎవరి తరం కాలేదు. ఈ దంపతులకు ఓ పాప - బాబు ఉన్నారు.