Begin typing your search above and press return to search.

భార్య/భర్తకు ఈ మూడు విషయాలు అస్సలు చెప్పొద్దు

By:  Tupaki Desk   |   21 Aug 2021 12:15 PM IST
భార్య/భర్తకు ఈ మూడు విషయాలు అస్సలు చెప్పొద్దు
X
భార్య భర్తల మధ్య దాపరికాలు ఉండకూడదంటారు.. కానీ కొన్ని విషయాలు చెప్పకూడదంటున్నారు.. ప్రతీ భార్య, భర్త తన మనసులో ఏం దాచుకోకుండా భాగస్వాములతో షేర్ చేసుకోవడం మంచిదే. అన్నీ విషయాలు చెప్పుకోవడం ద్వారా బంధం బలహీనమవుతుందని కొందరు పెద్దలు చెబుతున్నారు. అంటే ఎలాంటి విషయాలు భార్యభర్తలు షేర్ చేసుకోవాలి..? ఎటువంటి వాటివి చెప్పుకోవాలి..? అనేది చాలా మందిలో ఉండే సందేహమే. అయితే కొందరు ఇవి తెలియక తమ పాత విషయాలన్నీ చెప్పి తమ భాగస్వామిని ఇబ్బందులకు గురి చేస్తారు.

అయితే భార్యభర్తలు ఈ విషయాలను అస్సలు చెప్పకూడదని కొందరు నిపుణులు సూచిస్తున్నారు. సందర్భం ఏదైనా వీటిని దాచుకోవడం వల్లే మీ లైఫ్ సాఫీగా సాగుతుందని, లేకపోతే జీవితం ప్రమాదంలో పడుతుందని అంటున్నారు. మరి ఆ విషయాలేవో చూద్దాం..

1. పాత ఫ్రెండ్ తో కలిసున్న సంఘటనలు:

అబ్బాయి గానీ, అమ్మాయి గానీ కాలేజీ రోజుల్లో సరదాగా గడుపుతారు. తెలిసో తెలియకో కొందరు ప్రేమలో పడుతారు. ఇంకొందరు ఒకడుగు ముందుకేస్తారు. అయితే అనుకోని కారణాల వల్ల వీరు పెళ్లి చేసుకోరు. వేరే వేరే వ్యక్తులను పెళ్లి చేసుకుంటారు. కొన్ని రోజుల తరువాత తమ భాయ్ ఫ్రెండ్ లేదా గర్ల్ ఫ్రెండ్ ను మరచిపోతారు. అయితే భార్య భర్తలు కలిసి సరాదాగా మాట్లాడుకునే సమయంలో ఇలాంటి విషయాలు బయటపెట్టకపోవడమే మంచిది. ఎందుకంటే ఏ భర్త అయినా, ఏ భార్య అయినా ఇలాంటి విషయాన్ని అస్సలు అర్థం చేసుకోరు. ఈ విషయాల వల్ల ఎప్పటికైనా ప్రమాదంగానే ఉంటుంది.

2. అత్తమామలను గౌరవించండి:

భర్త లేదా భార్య తల్లిదండ్రులు ఒకరికొకరు నచ్చకపోవచ్చు. పెత్తనం విషయంలో వారిదే పైచేయి ఉండాలని ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటారు. అయితే ఈ విషయాన్ని భార్య లేదా భర్త అర్థం చేసుకోవాలి. వారు చెబుతున్నది విని మీకు కన్వినెంట్ అయితే చేయండి. లేదా మీకు నచ్చింది చేయండి. అయితే వారి ముందు మాత్రం వారి మాటలకు సరేనని చెప్పండి. అలా చెప్పడం వల్ల వారిని ఆ క్షణంలో గౌరవించినట్లవుతుంది.లేకపోతే మీ జీవితం గురించి వారు ఆందోళన పడాల్సి వస్తుంది. ఈ విషయంలో భార్య భర్తలెవరైనా అర్థం చేసుకొని మూవ్ కావాలి.

3. ప్రియుడు-ప్రియురాలితో టచ్ లో ఉంటే..:

చాలా పెళ్లిళ్లు ఇష్టంతోనే జరుగుతాయని చెప్పలేం. కొందరి బలవంతతోనే లేక పరిస్థితుల ప్రభావంతోనో ఇష్టం లేకున్నా పెళ్లి చేసుకుంటారు. అయితే ఆ తరువాత కొందరు సర్దుకుపోతారు. కానీ కొందరు అప్పటి వరకు ఎవరినైనా ప్రేమించి ఉంటే వారిని మరిచిపోలేరు. ఈ సమయంలో వారిని కలువకుండా ఉండలేదు. అయితే కలవడం వరకు ఓకే గానీ.. మితిమీరిన పనలు చేయకపోతే బెటర్. అయితే ఈ విషయాన్ని మీ భార్యకు లేదా భర్తకు చెప్పకపోవడమే మంచింది. ఎందుకంటే మీరు చేసేది మంచి పనే అయినా అక్కడా బ్యాడ్ మీనింగ్ వచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు.

ఇవే కాకుండా మీ భాగస్వామికి ఏవీ ఇష్టమో.. ఏవిషయాలు మాట్లాడితే అఇష్టంగా ఉంటున్నారో తెలుసుకోండి. కొన్ని విషయాలు మాట్లాడేటప్పుడు చిరాకుగా ఉంటే మరోసారి ఆ విషయాలను గుర్తుకు తేకండి. వాటిని దూరం పెట్టండి.అలాగే మంచి విషయాలతో పాటు వారిని ప్రశాంతమైన ప్రదేశాలకు తీసుకెళ్లండి. ఇలాంటి ప్రదేశాల్లో కొన్ని తప్పక చెప్పాల్సిన విషయాలుంటే చెప్పేయండి. కొందరు అర్థం చేసుకోవచ్చు. ఏమైనా తేడా వస్తుందనుకుంటే సారీ చెప్పి వారిని మచ్చిక చేసుకోండి. ఒక్కోసారి భాగస్వామి విషయంలో వెనుకడుగు వేస్తే పెద్ద ప్రమాదమేమి ఉండదు. అంతేకాకుండా జీవితం ఆనందంగా ఉంటుంది.