Begin typing your search above and press return to search.

ముమ్మారు తలాక్ చెబితే నో అన్నదని తగలెట్టేశాడు

By:  Tupaki Desk   |   19 Aug 2019 5:31 AM GMT
ముమ్మారు తలాక్ చెబితే నో అన్నదని తగలెట్టేశాడు
X
హిందూ ధర్మంలో లోపాలెన్నో.. ఆచారంలో ఎంత అనాగరికత ఉంది? అంటూ అదే పనిగా వేలెత్తి చూపించే వామపక్ష వాదులు.. ప్రగతిశీల భావకులు మరే మతం జోలికి ఎందుకు వెళ్లరో ఎంతకూ అర్థం కాదు. స్వయం ప్రకటిత మేధావులకు అన్ని ధర్మాల్లోని మంచిచెడ్డల గురించి మాట్లాడుతుండాలి. కానీ.. అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ.. ఏదైనా నిర్ణయాన్ని తీసుకున్నంతనే అడ్డు పడటం ఇండియాలో మాత్రమే కనిపిస్తుంది.

ముమ్మారు తలాక్ తప్పని.. అలా చేస్తే చట్టప్రకారం నేరమవుతుందన్న చట్టాన్ని తీసుకురావటానికి మోడీ సర్కారు పడిన శ్రమ అంతా ఇంతా కాదు. మతాన్ని రాజకీయాలకు ఎలా అన్వయించాలో బాగా తెలిసిన మజ్లిస్ అధినేత అసద్ లాంటోళ్లు ముమ్మారు తలాక్ ను ఎంతగా వ్యతిరేకిస్తారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే ఉండదు. ట్రిపుల్ తలాక్ నిర్ణయంపై ఒక్కరంటే ఒక్క ముస్లిం మహిళ కూడా వ్యతిరేకించింది లేదు. అలాంటిది ట్రిపుల్ తలాక్ కు ఇబ్బంది కలిగించే పురుష పుంగవులు మాత్రం గొంతులు చించుకుంటే దానికి మీడియాలోని ఒక వర్గంతో పాటు.. రాజకీయ పార్టీలు సైతం తమ గొంతు విప్పారు.

ముస్లిం మహిళలు బయటకు వచ్చి తమకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకునే పరిస్థితి చాలా తక్కువ కావటం దీనికో కారణంగా చెప్పాలి. ట్రిపుల్ తలాక్ కు నో చెబితే ఎలాంటి దారుణం జరుగుతుందో తెలిసే వైనం తాజాగా చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్ లోని శావస్తికి చెందిన ముస్లిం కుటుంబ పెద్ద రఫీక్ మహారాష్ట్రంలో పనులు చేసుకుంటూ జీవిస్తుంటాడు.

ఏమైందో ఏమో కానీ.. తాజాగా భార్యకు ఫోన్ చేసి ట్రిపుల్ తలాక్ చెప్పేశారు. ఆమె అందుకు అంగీకరించలేదు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. తాను ట్రిపుల్ తలాక్ చెప్పిన తర్వాత కూడా నో చెప్పటాన్ని జీర్ణించుకోలేని అతడు.. తాజాగా ఊరికి వచ్చి భార్యపై ఒత్తిడి తీసుకొచ్చాడు.

అతడి ఒత్తిళ్లకు లొంగకపోవటంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అతడు.. కిరోసిన్ పోసి ఆమెను తగలెట్టేశాడు. ఈ దారుణాన్ని ఐదేళ్ల చిన్నారి కళ్లారా చూసి మేనమామకు వివరించటంతో అసలు విషయం బయటకు వచ్చింది. కన్నతండ్రి కర్కసత్వాన్ని కళ్లారా చూసిన చిన్నారి గజగజలాడిపోతున్నాడు. మరి.. ఇలాంటి దుర్మార్గాల్ని అసద్ లాంటి నేతలు.. ప్రగతిశీల భావాలున్న మేధావులు ఎందుకు ఖండించరు? ముమ్మారు తలాక్ చెప్పటానికి చాతాండంత ప్రొసీజర్ ఉందని.. దాన్ని ముస్లిం పురుషులంతా పాటిస్తారని వాదించే వారు.. తాజా ఉదంతానికి ఏమని బదులిస్తారు?