Begin typing your search above and press return to search.

మరో ఇంజక్షన్ హత్య: కట్టుకున్న భార్యను ఇంజెక్షన్ ఇచ్చి చంపిన భర్త

By:  Tupaki Desk   |   22 Sept 2022 9:00 PM IST
మరో ఇంజక్షన్ హత్య: కట్టుకున్న భార్యను ఇంజెక్షన్ ఇచ్చి చంపిన భర్త
X
ఖమ్మం జిల్లాలో వరుసగా రెండో ‘ఇంజక్షన్ హత్య’ కలకలం రేపుతోంది. ఇటీవలే ఓ వ్యక్తిని ఇంజక్షన్ ఇచ్చి చంపిన ఘటన మరువక ముందే మరొకరిని ఇలా హత్య చేయడం సంచలనమైంది. ఆస్పత్రిలో బిడ్డకు జన్మనిచ్చి బాలింతగా ఉన్న భార్యను కనికరం లేకుండా హత్య చేశాడు భర్త. సెలైన్ లో మత్తు ఎక్కించి హతమార్చాడు. అనంతరం వైద్యుల వల్లే చనిపోయిందని రచ్చ చేశాడు. ఆందోళన చేశాడు. వైద్యులు నష్టపరిహారం ఇస్తామని చెప్పి పంపించారు. కానీ ఇక్కడే ట్విస్ట్ వచ్చింది.

ఖమ్మం జిల్లాలోని పెద్దతండాకు చెందిన భిక్షం ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు. ఇతడికి ఇద్దరు భార్యలు ఉన్నారు. మొదటి భార్యతో సంతానం కలగకపోవడంతో తనకంటే 20 ఏళ్లు చిన్నదైన నవీన అనే అమ్మాయిని రెండో పెళ్లి చేసుకున్నాడు. భార్యలు ఇద్దరితో గొడవలతో విసిగిపోయిన భిక్షం సంచలన నిర్ణయం తీసుకున్నాడు. రెండో భార్య గర్భవతి కాగా.. ప్రసవం కోసం ఆస్పత్రికి తరలించారు.

ఆడబిడ్డకు జన్మనిచ్చిన రెండో భార్య అపస్మారకస్థితిలో ఉండగా... ఆమె సెలైన్ బాటిల్ కు మత్తు ఇంజక్షన్ ఇచ్చాడు భిక్షం. అందరూ నిద్రపోయిన తర్వాత రాత్రి 2 గంటలకు ఈ పనిచేశాడు. సైలెంట్ గా వెళ్లి మత్తు ఇంజెక్షన్ ను సెలైన్ లో ఎక్కించాడు. మత్తు ఇంజక్షన్ కారణంగా గర్భిణి మృతిచెందింది. అనంతరం వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే భార్య చనిపోయిందంటూ బంధువులతో కలిసి ఆందోళన చేశారు. దీంతో ఆస్పత్రి వాళ్లు నష్టపరిహారం డీల్ కుదుర్చుకున్నారు.

అనంతరం గ్రామానికి తీసుకెళ్లకుండా ఖమ్మంలోనే అంత్యక్రియలు నిర్వహించారు. దీంతో అనుమానం వచ్చిన వైద్యులు, పోలీసులు సీసీ టీవీ కెమెరాలు పరిశీలించగా షాక్ అయ్యారు. భర్యకు ఇంజక్షన్ వేసి భిక్షం హతమార్చినట్టు చూసి వెంటనే అతడిని పట్టుకొని అరెస్ట్ చేశారు. ఇద్దరు భార్యల గొడవలతోనే ఈమెను హత్య చేసినట్టు అనుమానిస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.