Begin typing your search above and press return to search.

లాడ్జిలో భర్త రాసలీలలు ..భార్యకి తెలిసి ఏంచేసిందంటే ?

By:  Tupaki Desk   |   11 May 2020 2:40 PM IST
లాడ్జిలో భర్త రాసలీలలు ..భార్యకి తెలిసి ఏంచేసిందంటే ?
X
లాక్‌ డౌన్ ‌లోనూ ఇల్లు విడిచి.. ప్రియురాలితో రాసలీలలు కొనసాగిస్తున్న తన భర్తను పోలీసులకు పట్టించింది భార్య.. ఈ ఘటన హైదరాబాద్‌ లోని వనస్థలిపురంలో వెలుగు చూసింది. ఈ మధ్య కాలంలో అక్రమ సంబంధాలు ఎక్కువైపోయాయి. పెళ్లి అయిన తరువాత కూడా తమ జీవిత భాస్వాములని మోసం చేసేవారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. ఈ ఘటనలు ఎన్ని వెలుగులోకి వస్తున్నా కూడా ఆలా ప్రవర్తించే వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు.

తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఈ సంఘటన పై పూర్తి వివరాలు చూస్తే .. హైదరాబాద్‌ శివారులోని ఓ మున్సిపాలిటీకి వైస్ చైర్మన్‌ గా ఎన్నికైన అనిల్ అనే వ్యక్తి. లాక్ ‌డౌన్ సమయంలోనూ ఓ లాడ్జిలో అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్నాడు. లాడ్జి యజమాని కూడా అనిల్‌ కు తోడు కావడంతో అమ్మాయిలను పిలిపించుకుని రాసలీల్లో మునిగిపోయాడు. ఎప్పటిలాగే శనివారం కూడా పని ఉందని భార్యకి చెప్పి బయటకు వెళ్లాడు. నేరుగా లాడ్జిలో ప్రియురాలితో రాసలీలల్లో మునిగిపోయాడు.

అయితే, ఈ విషయాన్ని పసిగట్టిన అతని భార్య, భర్తకి సరైన బుద్ది చెప్పాలని ఓ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే లాడ్జిలో వ్యభిచార ముఠా ఉందంటూ పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో పోలీసులు ఆ లాడ్జిపై రైడ్ చేశారు. ఆ సమయంలో రూమ్ లో ముగ్గురు అమ్మాయిలు, అనిల్, లాడ్జి యజమాని సునీల్‌ ఉన్నారు. వారందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.