భార్య బాత్ రూమ్ వీడియో తీసి.. ఆ తర్వాత ఏం చేశాడంటే..

Wed Jun 23 2021 15:03:55 GMT+0530 (IST)

husband harassed to wife

బాత్ రూమ్ లో భార్య స్నానం చేస్తోంది. దొంగ చాటుగా భర్త వీడియో తీశాడు. ఆ తర్వాత భార్యను వేధించడం మొదలు పెట్టాడు. ఎందుకిలా చేస్తున్నాడో భార్యకు అర్థం కాలేదు. చివరకు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వచ్చింది. పోలీసులు విచారిస్తే.. పొంతనలేని సమాధానం చెప్పాడు సదరు భర్త. ఆ సమాధానం.. అతని తీరు చూసిన పోలీసులు నివ్వెరపోయారు.మహారాష్ట్ర కు చెందిన భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం చేసుకునే వారు. కరోనా నేపథ్యంలో భర్త ఉద్యోగం కోల్పోయాడు. దీంతో.. భార్య సంపాదనతోనే ఇల్లు గడుస్తోంది. అయితే.. కొన్నాళ్లు గడిచిన తర్వాత భార్య అనుమానించడం మొదలు పెట్టాడు భర్త. ఎవరితో వెళ్లి వస్తున్నావు? ఇప్పటి దాకా ఎక్కడ తిరిగి వచ్చావు? అని వేధించడం స్టార్ట్ చేశాడు.

రానురానూ ఈ పరిస్థితి మరింతగా శృతి మించుతోంది. తాను ఏ పాపమూ ఎరుగనని ఆమె చెప్పినా.. ఇతగాడు వినిపించుకునే పరిస్థితుల్లో లేడు. తాను షూట్ చేసిన భార్య బాత్ రూమ్ స్నానం వీడియోను చూపించాడు. ఆ వీడియోను బయట పెడతానని ఆమెను మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టాడు. దీంతో.. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

భర్తను స్టేషన్ కు పిలిపించిన పోలీసులు ప్రశ్నించారు. ఈ విచారణలో వింత కారణాన్ని పోలీసులు కనుగొన్నారు. ఉద్యోగం పోవడంతో ఇంట్లోనే ఉంటున్న భర్త మానసికంగా కుంగిపోయాడు. అతనికి పొద్దుపోయేది కాదు. అదే సమయంలో.. మనసులో పలురకాల భయాలు మెదిలేవి. భవిష్యత్ గురించి ఆలోచిస్తూ.. సోషల్ మీడియా యూట్యూబ్ వీడియోలు వంటి వాటితో గడిపీ గడిపి మానసిక రుగ్మతలకు గురయ్యాడు.

ఈ కారణంగానే.. ఉద్యోగానికి వెళ్లి వస్తున్న భార్యపై అనుమానం పెంచుకున్నాడని వారు పసిగట్టారు. వీడియో ఎందుకు తీశావని అడగగ్గా.. భార్య లేక నాకు బోర్ కొడుతోంది. అందుకే.. ఆమెను మిస్ కాకుండా ఉండాలని వీడియో తీసుకున్నానని చెప్పడం గమనార్హం. ప్రస్తుతం అతన్ని అరెస్టు చేశారు.