Begin typing your search above and press return to search.

ఢిల్లీ అల్లర్లకు వందల వాట్సప్ గ్రూపులు

By:  Tupaki Desk   |   4 March 2020 4:00 PM IST
ఢిల్లీ అల్లర్లకు వందల వాట్సప్ గ్రూపులు
X
పౌరసత్వ సవరణ చట్టం వ్యతిరేక, అనుకూల వ్యతిరేక వర్గాల మధ్య చెలరేగిన అల్లర్లు ఈశాన్య ఢిల్లీలో హింసాత్మక వాతావరణం ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ అల్లర్లలో ఏకంగా 42 మంది మృతి చెందడం, ఆస్తి నష్టం భారీగా ఏర్పడింది. ఈ అల్లర్లు దేశ వ్యాప్తంగా కలకలం రేగింది. అయితే ఇవన్న పక్కా ప్రణాళికతో పకడ్బందీగా.. ఉద్దేశ పూర్వకంగా చేశారని వెల్లడవుతున్నాయి. దానికి సంబంధించిన వివరాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఈ అల్లర్లకు సోషల్ మీడియా ను ప్రధానం గా వినియోగించుకున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా ద్వారా అందరినీ సమన్వయం చేసుకుని దాడులకు పాల్పడినట్లు సమాచారం. ఈ అల్లర్లల కోసం వందల సంఖ్యలో వాట్సప్ గ్రూపులు క్రియేట్ చేసి దాడులకు తెగబడ్డారని పోలీసులు వర్గాలు గుర్తించాయి.

ఈశాన్య ఢిల్లీ ప్రాంతం లో అల్లర్లు చెలరేగేందుకు వాట్సప్ గ్రూపులను ప్రధానం వినియోగించినట్లు ఢిల్లీ పోలీసులు గుర్తించారు. అల్లర్లు చెలరేగిన ఫిబ్రవరి 23, 24 తేదీల్లోనే అత్యధిక వాట్సప్ గ్రూపులు క్రియేటయ్యాయి. ఈ వాట్సప్ గ్రూపులలో గతంలో జరిగిన హింసాత్మక ఘటనల వీడియోలు షేర్ చేసి అల్లర్లు చేసేలా రెచ్చగెట్టేలా చేశారు. అనంతరం ఎక్కడ, ఎవరి ఇంటి పై దాడి చేయాలి? ఎక్కడ చేయాలి? అనే విషయాలన్నీ కూడా వాట్సప్ గ్రూపుల్లోనే చర్చించి ఆ మేరకు అల్లరిమూకలు దాడులకు తెగబడ్డాయి. ముఖ్యంగా కార్లే వారి లక్ష్యంగా మారిందని ఆ వాట్సప్ గ్రూపులు చూస్తుంటే తెలుస్తోంది. ఈ అల్లర్ల సమయం లో పోలీసులు ఎక్కుడున్నారు? ఎక్కడ దాడులు చేస్తే ప్రభావం తీవ్రంగా ఉంటుందని గ్రూపుల్లోనే చర్చించారు. అయితే ఈ అల్లర్లకు కొందరు స్థానిక రౌడీలు, గూండాలు సహకరించినట్లు సమాచారం.

లోని, ఘజియాబాద్ తో పాటు పశ్చిమ ఉత్తర ప్రదేశ్ కు చెందిన కొన్ని గ్యాంగ్ లకు చెందిన వారు ఈ అల్లర్లు తీవ్రమయ్యేలా చేశారని పోలీసులు గుర్తించారు. ఈ అల్లర్ల విషయ మై పోలీసులు 482 కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో 34 మంది అరెస్ట్ కాగా, 1,427మందిని విచారిస్తున్నారు. ఈ క్రమం లో వాటిని గుర్తించారు. ఈ విధంగా సామాజిక మాధ్యమాలను దుర్వినియోగం చేస్తున్నారు. సోషల్ మీడియా ఢిల్లీ అల్లర్లు చెలరేగడానికి ఓ కారణం కావడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇప్పటికే సోషల్ మీడియా నిషేధం పై చర్చ సాగుతున్న సమయంలోనే ఢిల్లీ అల్లర్లకు వాటి వినియోగించడం పై పోలీసులు నివ్వెర పోతున్నారు. సోషల్ మీడియా కట్టడికి ప్రభుత్వాలతో కలిసి పోలీసులు చర్చిస్తున్నారు.