Begin typing your search above and press return to search.

'జూ'లో జంతువుల్లాగా మనుషులు.. ఎక్కడో తెలుసా?

By:  Tupaki Desk   |   4 Nov 2022 1:30 AM GMT
జూలో జంతువుల్లాగా మనుషులు.. ఎక్కడో తెలుసా?
X
భూమిపై మనిషి పుట్టి కొన్ని కొన్ని వేల సంవత్సరాలవుతోంది. తొలినాళ్లలో అడవుల్లో జంతువులతో కలిసి జీవించారు. మనిషి అగ్నిని కనుగొన్న తర్వాత నాగరికత మొదలైంది. క్రూర మృగాలకు దూరంగా ఉంటూ వస్తున్న మనిషి సాధు జంతువులను మచ్చిక చేసుకొని వ్యవసాయానికి ఇతర పనులకు వాడుకుంటూ అభివృద్ధి చెందుతూ వస్తున్నాడు.

మానవ చరిత్రను ముఖ్య క్రీస్తు పూర్వం.. క్రీస్తు శకంగా చరిత్రకారులు విభజించారు. క్రీస్తు పూర్వం బొమ్మ లిపి మాత్రమే అందుబాటులో ఉండేది. వీటి ఆధారంగా నాటి ప్రజలు ఎలా జీవించారని తెలుసుకునే అవకాశం లభించింది. క్రీ.శంలో మనిషి భాషకు ప్రాధాన్యం ఇవ్వడంతో నాడు పాలించిన రాజులు చర్రిత, మనిషి జీవన విధానంలో పుస్తకాల రూపంలో ఇప్పటికీ మనకు అందుబాటులో ఉంది.

ఆంటోనియో సొలిస్ రివడేనీరా (1610-1686) అనే స్పానిష్ చరిత్రకారుడి కథనం మేరకు.. యూరప్ దేశాల్లో నాడు మనుషులు ఎంత దీనస్థితిలో జీవించేవారో వెల్లడించారు. 15వ శతాబ్దం ఆరంభంలో ప్రస్తుత మెక్సికో ప్రాంతంలో ఆజ్టెక్ సామ్రాజ్యం ఉందని.. ఇక్కడే 'మాక్టె జుమా' అనే మనుషుల జూ ఉందని పేర్కొన్నారు.

ఈ మాక్టె జుమా జూలో పక్షులు.. జంతువులు.. విష జీవులతో పాటు మనుషులను బఫూన్లు.. మరుగుజ్జులు.. గూని వారు ఇతరులను ప్రదర్శనకు పెట్టేవారట. నాడు శారీరక వైకల్యాలను అపశకునాలుగా భావించేవారని.. దుష్టశక్తులకు సాక్ష్యాలుగా భావించేవారని తన రచనల్లో తెలిపారు. వీరిని ఊరురా తిప్పుతూ ప్రదర్శించేవారు.

ఈ ప్రక్రియ ఆ తర్వాత నాలుగు శతాబ్దాల వరకు కూడా పశ్చిమ ప్రపంచంలో కొనసాగిందని ఆయన తన రచనల్లో వెల్లడించారు. ఆఫ్రికా దేశాలు.. ఇతర ప్రాంతాల నుంచి మనుషులను పట్టుకొచ్చి జంతువుల్లాగా 'జూ'ల్లో ప్రదర్శించిన చరిత్ర యూరప్‌‌ వలస పాలకులకు ఉందని పేర్కొన్నారు.

సముద్రాల నుంచి ఖండాలకు అన్వేషణ మొదలైనప్పటి నుంచి ఇలాంటి అమానవీయ ఘటనలు ఎన్నో జరిగాయని వెల్లడించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వలస రాజ్యాలు కుప్పకూలే వరకు కూడా యూరోప్ పాలకులు మనుషులు జంతువుల్లానే 'జూ' లో ప్రదర్శించే అమానవీయమైన ఘటనలు జరిగాయని ఆంటోనియో సోలిస్ రివడేనియా అనే చరిత్రకారుడు వెల్లడించారు.

18వ దశాబ్దంలో కాంగోలీస్ అనే గ్రామంలో ఇలాంటి అటవీక చర్య జరిగిందని ఓ జర్నలిస్టు రాశారు. సుమారు 267 మంది కాంగోలీస్‌ను బ్రసెల్స్‌కు దిగుమతి చేసుకోగా వీరిలో చాలామంది చలికి తట్టుకోలేక చనిపోయారని పేర్కొన్నారు. వీరిపట్ల జనంలో విపరీతమైన ఆకర్షణ పెరగటంతో అక్కడ ఒక ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారని తెలిపాడు.

బ్రసెల్స్ ఇంటర్నేషనల్ అండ్ యూనివర్సల్ ఎగ్జిబిషన్‌లో భాగంగా కాంగోలీస్ గ్రామాన్ని ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. కాంగోలీస్ చుట్టూ కట్టిన వెదురు బొంగుల దడికి అవతలి నుంచి సందర్శకులు జూలోని మనుషులను వీక్షించేవారని తెలిపారు. వారి కేకలు, అరుపులకు కాంగోలీస్ స్పందించకపోతే వారి మీద నాణేలు.. అరటిపండ్లు విసిరేవారని ఆ జర్నలిస్ట్ రాశారు.

తమను ఉంచిన పరిస్థితులు, సందర్శకుల నుంచి వేధింపులకు ఆ కాంగొలీస్ జనం విసిగిపోయారని చెప్పారు. దీంతో ఈ తర్వాత రోజుల్లో ఈ మానవ జూ మూతపడిందని తెలిపారు. ఇదే చరిత్రలో చివరి మానవ జూగా చరిత్రలో నిలిచింది. ఈ జూను దాదాపు 140 కోట్ల మంది జనం వీక్షించారని అంచనా. ఆధునిక జాతి వివక్షా వాదంలో నాటి మానవ జూలు కీలక పాత్ర పోషించాయని చరిత్రకారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.