Begin typing your search above and press return to search.

రఘురామ వివాదం: ఏపీకి మానవ హక్కుల కమిషన్ నోటీసులు

By:  Tupaki Desk   |   29 Jun 2021 11:00 PM IST
రఘురామ వివాదం: ఏపీకి మానవ హక్కుల కమిషన్ నోటీసులు
X
నర్సాపురం రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అందివచ్చిన ఏ అవకాశాన్ని కూడా వదలడం లేదు. తనను అరెస్ట్ చేసిన ఏపీ ప్రభుత్వంపై పగబట్టి చేయాల్సిందంతా చేసేస్తున్నాడన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా రఘురామ అరెస్ట్ పై జాతీయ మానవహక్కుల కమిషన్ (ఎన్.హెచ్.ఆర్.సీ) ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

రఘురామ కుమారుడు అప్పట్లో తన తండ్రిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి హింసించారని జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదుపై తాజాగా మానవ హక్కుల కమిషన్ స్పందించింది. దీనిపై ఏపీ ప్రభుత్వానికి నోటీసులు పంపింది. రాష్ట్రప్రభుత్వం, పోలీసులు ఆగస్టు 9లోపు ఎన్.హెచ్.ఆర్.సీ గడువు విధించింది. గడువులోగా నివేదిక ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైతే ఆగస్టు 16న జరిగే తదుపరి సమావేశానికి సీనియర్ అధికారులను పిలుస్తామని ఎన్.హెచ్.ఆర్.సీ హెచ్చరించింది.

ఇక ఎంపీ అరెస్ట్ పై సమగ్ర నివేదిక కోరుతూ డీజీపీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధిత్యనాథ్ కు నోటీసులు పంపింది. ఎన్.హెచ్.ఆర్.సీ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక కోరి జూన్ 7లోపు స్పందించాలని కోరింది. ఇప్పుడు తాజాగా మరోసారి నోటీసులు పంపింది.

దేశద్రోహ ఆరోపణలపై ఎంపీ రఘురామను ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తనను పోలీసులు హింసించారని రఘురామ ఆరోపణలు గుప్పించారు.