Begin typing your search above and press return to search.

వీర కామ్రేడ్ నారాయణ వీడియో చూసి మారకపోతే ఇంతే

By:  Tupaki Desk   |   7 Dec 2019 10:16 AM GMT
వీర కామ్రేడ్ నారాయణ వీడియో చూసి మారకపోతే ఇంతే
X
దిశ నిందితుల్ని ఎన్ కౌంటర్ చేసిన వైనంపై తెలంగాణ పోలీసులపై దేశ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్న వేళ.. మానవహక్కుల కార్యకర్తలంటూ తెర మీదకు వస్తున్న వారికి కొత్త షాకులు ఎదురవుతున్నాయి. ఎన్ కౌంటర్ ను తీవ్రంగా ఖండిస్తున్న ఈ సామాజికవేత్తలు కేసులు పెడుతున్నారు. ఇలా కేసులు పెడుతున్న వారిలో మీడియాలో తరచూ కనిపించే సంధ్య.. దేవిలతో పాటు విమల మోర్తాల.. పద్మజ షాతో పాటు మీరా సంఘమిత్ర లాంటి మరికొందరు కలిసి కేసులు పెడుతున్నారు.

ఇలాంటివారిపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. కేసుల పేరుతో హడావుడి చేస్తున్నారంటూ వీరిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే వీరిపై సోషల్ మీడియాలో తిట్ల వర్షం కురుస్తోంది. అన్యాయం జరిగినప్పుడు బయటకు రారు.. సమస్యను పరిష్కరించరు కానీ సమస్యను పెంచటానికి మాత్రం వస్తారంటూ మండి పడుతున్నారు.

న్యాయం జరిగిన తర్వాత తెర మీదకు వచ్చి లొసుగులు కనిపెట్టి పబ్లిసిటీ వీరు చేసే స్టంట్లు మామూలుగా లేవంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మాట్లాడుతున్న వారంతా అన్యాయం జరిగినప్పుడు ఎందుకు రావట్లేదు? న్యాయం జరిగిన తర్వాత వచ్చి నాలుకలు ఆడిస్తున్న వీరికి ప్రజలు త్వరలోనే బుద్ది చెప్పే రోజు దగ్గర్లోనే ఉంటుందని విమర్శిస్తున్నారు.

దేశం మొత్తం దిశ విషయంలో న్యాయం జరిగిందని తెలంగాణ పోలీసుల్ని మెచ్చుకుంటున్నారని.. కానీ ఈ హక్కుల కార్యకర్తలు.. మానవతావాదులు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారంటున్నారు. ఒక ఆడపిల్లకు అన్యాయం జరిగినా ఫర్లేదు కానీ ఆ నలుగురు క్రూరులకు మాత్రం న్యాయం జరగాలని పోరాడుతున్న వైనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు.

తెలంగాణ పోలీసులపై కేసులు పెడుతున్న వీరి తీరును సోషల్ మీడియాలో తీవ్రంగా విమర్శిస్తున్నారు. తమ వాదనకు మరింత మద్దతు కూడగట్టుకునేందుకు #AntiSocialActivists హ్యాష్ ట్యాగ్ తో పోస్టులు పెడుతున్నారు. దీంతో.. ఈ హ్యాష్ టాగ్ ఇప్పుడు పాపులర్ అవుతోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే వీర కమ్యూనిస్టు.. వామపక్ష భావజాలం నరనరాన నింపుకున్న సీపీఐ నారాయణ లాంటి వారు దిశ ఎన్ కౌంటర్ కు తాను మద్దతు ఇస్తున్నట్లుగా వీడియో సందేశంలో చెప్పటం తెలిసిందే. ఇదే విషయాన్ని కొందరు ప్రస్తావిస్తూ.. ప్రజలకు తగ్గట్లు నారాయణ లాంటి వారు తమ మైండ్ సెట్ ను మార్చుకుంటున్నారు. కానీ.. హక్కుల కార్యకర్తల పేరుతో కొందరు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారంటూ తిట్టి పోస్తున్నారు. సోషల్ మీడియాలో జనాగ్రహానికి గురవుతున్న వీరు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.