Begin typing your search above and press return to search.

దాంతో మ‌నిషి ఆయుష్షు 9 ఏండ్లు త‌గ్గుతుంద‌ట‌!

By:  Tupaki Desk   |   3 Sept 2021 4:00 PM IST
దాంతో మ‌నిషి ఆయుష్షు 9 ఏండ్లు త‌గ్గుతుంద‌ట‌!
X
వాయు కాలుష్యం కార‌ణంగా మ‌నిషి ఆయుష్సు త‌గ్గిపోతోంది. భార‌త‌ దేశంలోని ఢిల్లితో పాటు ప‌లు న‌గ‌రాల్లో తీవ్రంగా వాయు కాలుష్యం ఉంద‌ని అమెరికా రీసెర్చ్ గ్రూప్ త‌న నివేదిక‌లో వివ‌రించింది. ఇండియాలోని తూర్పు, ఉత్త‌ర మ‌ధ్య రాష్ట్రాల్లో 483 మిలియ‌న్ల‌కు పైగా ప్ర‌జ‌లు వాయు కాలుష్యం గుర‌యితున్న‌ట్టు రీసెర్చ్‌లో తేలింద‌ని అమెరికాలోని చికాగో యూనివ‌ర్సిటీలోని ఏన‌ర్జీ పాల‌సీ ఇన్‌స్టిటూ్య‌ట్ (ఈ పిక్‌) బుధ‌వారం తెలిపింది. అయితే ప్ర‌పంచంలోనే ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉంద‌ని హెచ్చ‌రించింది.

అక్కడ ఉన్న ప్ర‌జ‌లు ఎక్కువ‌గా ఊపిరితిత్తుల స‌మ‌స్య‌లు, శ్వాస సంబంధిత రోగాలతో బాధ‌ప‌డుతున్న‌ట్టు వివ‌రించింది. భౌగోళికంగా తీవ్ర‌స్థాయిలో వాయు కాలుష్యం విస్త‌రిస్తుంద‌ని ఈ పిక్ ఆందోళ‌న చెందింది. దీని వ‌ల్ల మ‌నిషి స‌గ‌టు ఆయుష్సులో 9 ఏండ్లు త‌గ్గిపోవ‌చ్చ‌ని తెలిపింది. స‌మ‌ర్థ‌వంత‌మైన ఎయిర్ క్లీన‌ర్‌ల‌ను ప్ర‌వేశ‌పెడితే ఐదేండ్ల ఆయుష్సు పెంచొచ్చ‌ని వివ‌రించింది. అయితే ఈ కాలుష్యాన్ని ఇప్పుడే నియంత్రించ‌క‌పోతే రానున్న రోజుల్లో మ‌రికొన్ని ప్రాంతాల‌కు విస్త‌రించే అవ‌కాశం ఉంద‌ని ఆ సంస్థ ఆవేద‌న వ్య‌క్తం చేసింది.

కాలుష్య నివేదిక జాబితాలో భార‌త్ కు చెందిన న‌గ‌రాలు ప్ర‌తి ఏడు ముందు వ‌రుస‌లో ఉంటున్నాయ‌ని రాసుకొచ్చింది. దీని వ‌ల్ల వాయు కాలుష్యానికి గురై భార‌త్‌లో ప్ర‌తి ఏడాది సుమారు 10 ల‌క్ష‌ల మంది మ‌ర‌ణిస్తున్నార‌ని ఆ నివేదిక‌లో పేర్కొంది. అత్యంత కాలుష్యం వెద‌జ‌ల్లే నివేదిక‌లో భార‌త్ టాప్ 5లో ఉంద‌ని, బంగ్లాదేశ్‌, నేపాల్, పాకిస్తాన్ లు ప్ర‌తిసారి టాప్‌5 లోప‌లే ఉంటున్నాయ‌ని తెలిపింది. 2000 సంవ‌త్స‌రం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు చూస్తే మూడు సంవ‌త్స‌రాల ఆయుష్సు త‌గ్గింద‌ని వివ‌రించింది.

ఈ కాలుష్యాన్ని త‌గ్గిస్తే ప్ర‌తి మాన‌వుడి ఆయుష్సు 10 సంవ‌త్స‌రాల వ‌ర‌కు పెర‌గొచ్చ‌ని అంచ‌నా వేసింది. కాలుష్యాన్ని నియంత్రించ‌టానికి భార‌త్ రెండేండ్ల కింట నేష‌న‌ల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం ఏర్పాటు చేసింద‌ని. దీని వ‌ల్ల ప్ర‌జ‌లు ఆయు ప్ర‌మాణం పెంచేందుకు త‌గు చ‌ర్య‌లు తీసుకుందిని అభింనందించింది. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూ హెచ్‌వో) సూచ‌న‌ల మేర‌కు ప‌క్క‌నున్న బంగ్లాదేశ్ కూడా వాయు కాలుష్యాన్ని నియంత్రంచేందుకు చ‌ర్య‌లు ప్రారంభించిన‌ట్టు ఈపిక్ తెలిపింది. అయితే ఢిల్లీ ప్ర‌భుత్వం వాయు కాలుష్యం ఏర్ప‌డ‌కుండా కొన్ని చ‌ర్య‌లు తీసుకొంది.

అందులో భాగంగా స‌రి బేసి సంఖ్య‌ల విధానంతో కొంత స‌త్పాలితాలు సాధించింది. అయిన‌ప్ప‌టికీ పూర్తి స్థాయిలో రూపు మాప‌లేక‌పోయింది. అయితే కాలుష్యాన్ని నియంత్రంచ‌డంలో మంచి ఫ‌లితాల‌ను సాధిస్తోంద‌ని తెలిపింది. 2013లో గాలిలోని సూక్ష్మ ధూళి క‌ణాల‌ను 29 శాతం త‌గ్గించగ‌లిగింద‌ని వివ‌రించింది. ఈ మేర‌కు భార‌త్ ప‌టిష్ట‌మైన చ‌ర్య‌లు తీసుకోక‌పోతే ఇక్క‌డి మాన‌వాళి తీవ్ర‌మైన న‌ష్టం ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించింది.

ఇప్ప‌టి నుంచే ప‌లు న‌గ‌రాల్లో ఎయిర్ క్లీన‌ర్‌ల‌ను పెట్టి వాయు కాలుష్యాన్ని త‌గ్గించాల‌ని సూచించింది. లేకుంటే మ‌ధ్య భార‌త దేశంలోని మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, మ‌హారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో కూడా ఈ కాలుష్యం విస్త‌రించి చాలా మంది ప్రాణాలు తీసే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేసింది. ఈ మేర‌కు భార‌త ప్ర‌భుత్వం ఎలాంటి చ‌ర్యలు తీసుకుంటుందో చూడాలి.