Begin typing your search above and press return to search.

కరోనా వైరస్ ను శరీరం ఎంతవరకు తట్టుకోగలదు?

By:  Tupaki Desk   |   4 April 2020 5:00 AM IST
కరోనా వైరస్ ను శరీరం ఎంతవరకు తట్టుకోగలదు?
X
కరోనా వైరస్. ఇదొక అంటువ్యాధి. మనిషి నుంచి మనిషికి వేగంగా వ్యాపిస్తూ ఇప్పుడు ప్రపంచాన్ని కబళిస్తోంది. అయితే ఈ వ్యాధి సోకిన వారిలో 2శాతం మంది మాత్రమే చనిపోతున్నారు. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే వృద్ధులు - చిన్న పిల్లల మరణాలే ఎక్కువగా సంభవిస్తున్నాయి. రోగి యొక్క రోగ నిరోధకశక్తిపై దాడి చేసి వారి ఇమ్యూనిటిసిస్టంపై దెబ్బతీసి చంపేస్తోంది.

దీనిపై తాజాగా అధ్యయనం చేసిన జాన్స్ హాప్ కిన్స్ యూనివర్సిటీ పరిశోధకుడు ఆండ్రూ పెకోజ్ సంచలన విషయాలు వెల్లడించారు. కరోనాతో వ్యాధి తగ్గినా ఇది మళ్లీ రోగం ముదరవచ్చని తెలిపాడు. మనుషులకు రోగనిరోధక శక్తి బాగా ఉన్నంత వరకు ఏమీ కాదని తెలిపాడు.

కరోనా వైరస్ కూడా చికెన్ పాక్స్, పోలియో లాంటి వైరస్ అని ఆండ్రా తెలిపారు. మిగిలిన వైరస్ లు అంత ప్రభావం చూపించకపోవచ్చు. కరోనా వైరస్.. లాంటివి కొన్ని నెలలు కంటే ఎక్కువ కాలం కూడా ఉండొచ్చని తెలిపాడు.

కరోనాపై వ్యాక్సిన్లు వైరస్ క్రిములపై పోరాడే శక్తిని మాత్రమే మనిషికి ఇస్తాయని.. అంతేకానీ వ్యాక్సిన్లు ద్వారా కరోనాను తగ్గించలేం అని ఆయన కుండబద్దలు కొట్టారు. రోగ నిరోధక శక్తియే దీనికి మందన్నారు.