Begin typing your search above and press return to search.

తెలంగాణ లో గులాబీ కి చుక్కెదురు !

By:  Tupaki Desk   |   2 Jan 2020 10:45 AM GMT
తెలంగాణ లో గులాబీ కి చుక్కెదురు !
X
రాజకీయం ...ఇప్పుడు , ఇలా మార్పు చెందుతుందో ..ఎవరు ఏ పార్టీలోకి ఎందుకు వెళ్తారో ..ఒక్క ఆ రాజకీయ నేతలకి తప్ప ఇంకొకరికి అర్థం కాదు. అసలు ఎప్పటినుండో ఒక పార్టీలో ఉన్న నేతలు ..రాత్రికి రాత్రి తట్టా బుట్టా సర్దేసుకొని ఇంకో పార్టీలోకి జంప్ అవుతుంటారు. ప్రస్తుత రాజకీయాలలో ఇది చాలా కామన్ అయిపోయింది. అసలు ఎవరు ఏ పార్టీలో ఉన్నారో కూడా సరిగ్గా చెప్పలేని పరిస్థితి వస్తుంది. ఎందుకంటే రాత్రి వరకేమో ..ఆబ్బె ఆ పార్టీలోకి మేము ఎందుకు వెళ్తాము ..మాకేం అవసరం అంటారు ..తెల్లారేసరికి తిరిగి అదే పార్టీ లో చేరి ఆ పార్టీ తరపున ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తారు. రాజకీయాలలో ఏదైనా సాధ్యమే. ఇలాంటి ఘటనలు మనం ఇప్పటికే ఎన్నో చూసివుంటాం..

ఇకపోతే ఏ పార్టీ ప్రభావం అయినా కూడా కొన్ని రోజులే ..ఇక ఆ పార్టీ పరిస్థితి అయిపోయింది అనుకున్న ఎన్నో పార్టీలు మళ్లీ పడిలేచే కెరటంలా ఉవ్వెత్తున ఎగిసిపడి అధికారాన్ని చేజిక్కించుకున్నాయి. ఇక పోతే ఏదేమైనా కూడా విపక్ష పార్టీ నుండి అధికార పార్టీలోకి వెళ్లడం అనేది ఈ మధ్య రోజుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. కానీ , తెలంగాణాలో దానికి భిన్నంగా కనిపిస్తుంది. గత కొన్ని రోజుల కిందటి వరకు అధికార టీఆర్ఎస్ పార్టీలోకి జంపింగ్‌ల ప‌రంప‌ర కొన‌సాగిన సంగ‌తి తెలిసిందే. చిన్న చిన్న లీడ‌ర్ల నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేల వ‌ర‌కూ అందరూ గంపగత్తుగా గులాబీ పార్టీలో చేరిపోయారు.

కానీ , తాజాగా సీన్ రివ‌ర్స్ అయింది. వనపర్తి జిల్లా కు చెందిన టీఆర్‌‌‌‌ ఎస్‌‌‌‌ నేతలు, కార్యకర్తలలు గాంధీభవన్ వేదికగా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్‌‌‌‌కుమార్‌‌‌‌ రెడ్డి స‌మ‌క్షం లో ఈ చేరిక‌లు జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా ఉత్త‌మ్ మాట్లాడుతూ...కాంగ్రెస్‌‌‌‌ నుంచి టీఆర్ఎస్ లోకి వెళ్లినవాళ్లు వెనక్కి రావాలని పిలుపునిచ్చారు. టీఆర్‌‌‌‌ ఎస్‌‌‌‌ కుటుంబ పార్టీ అని, కేసీఆర్‌‌‌‌ ది దోపిడీ పాలన అని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్‌‌‌‌ మాత్రమే బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీల కు ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు.

అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ ఏమయ్యాయని ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి, రుణమాఫీ, రైతు బంధు.. ఎటుపోయాయని నిలదీశారు. మున్సిపల్‌‌‌‌ ఎన్నికల్లో ఈ అంశాలనే తాము ప్రచారాస్త్రాలుగా ముందుకు తీసుకెళ్తామని చెప్పారు.మున్సిపల్‌‌‌‌ ఎన్నికల గురించి మాట్లాడితే నాపై టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ నేతలు పిచ్చి పిచ్చి విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్‌‌‌‌ భయపడుతోందని అంటున్నారు. కాంగ్రెస్‌‌‌‌కు అలాంటి భయమేంలేదు. నేను ఎన్నో ఎన్నికల్లో విజయం సాధించాను. మున్సిపోల్స్‌‌‌‌ను ఎదుర్కోవడం మాకు సమస్య కాదు అని ఉత్తమ్ అన్నారు.

ఇదే సమయం లో వనపర్తి టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ నేత, మాజీ ఎంపీపీ శంకర్‌‌‌‌ నాయక్‌‌‌‌ మాట్లాడుతూ.. తాను కాంగ్రెస్‌‌‌‌ నుంచి వెళ్లి పెద్ద తప్పు చేశానని , తాను టీఆర్‌‌‌‌ ఎస్‌‌‌‌ లో ఉన్న మూడేళ్ళ కాలంలో ఏ రోజూ సంతోషంగా లేనని చెప్పారు. టీఆర్‌‌‌‌ ఎస్‌‌‌‌ పాలనలో ఏ వర్గం కూడా ఆనందంగా లేదు అని , పదవులు ఇస్తామని పార్టీలోకి చేర్చుకొని తర్వాత కనీసమైన విలువ కూడా ఇవ్వలేదని, అందుకే ఆ పార్టీని వీడి మళ్లీ కాంగ్రెస్ లోకి వచ్చినట్లు చెప్పారు. అలాగే కాంగ్రెస్ ని వీడిన ప్రతి ఒక్కరూ కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని పిలుపునిచ్చారు.