Begin typing your search above and press return to search.

బాబుకు కుప్పం.. యనమలకు తుని.. షాక్ తప్పదా?

By:  Tupaki Desk   |   4 March 2021 6:30 AM GMT
బాబుకు కుప్పం.. యనమలకు తుని.. షాక్ తప్పదా?
X
టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం కొనసాగింది. కొన్ని దశాబ్దాలుగా పెట్టని కోట వలే నిర్మించుకున్న కుప్పం కోటను వైసీపీ బద్దలు కొట్టిందన్న చర్చ రాజకీయవర్గాల్లో సాగుతోంది. . టీడీపీ అధినేతకు ఘోర అవమానాన్ని మిగిల్చిందని అంటున్నారు. ఆ దెబ్బకు చంద్రబాబు ఇప్పుడు కుప్పంలో పర్యటిస్తూ నష్టనివారణ చర్యలు చేపడుతున్నారు.

ఇప్పుడు మరో నేతకు కూడా వైసీపీ షాక్ ట్రీట్ మెంట్ రెడీ చేసిందని ప్రచారం సాగుతోంది. తుని నియోజకవర్గం టిడిపి సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడుకు సొంత నియోజకవర్గం. ఈ మున్సిపల్ ఎన్నికల్లో తునిలో యనమలకు షాక్ ఇచ్చేందుకు వైసీపీ రెడీ అయ్యిందట.. ఈ మేరకు అక్కడ రంగం సిద్ధం చేసిందన్న టాక్ నడుస్తోంది.

తుని మున్సిపాలిటీలో మొత్తం 30 వార్డులు ఉన్నాయి. ఈ మునిసిపాలిటీలో 15 వార్డులను అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ ఏకగ్రీవంగా గెలుచుకుంది.

నామినేషన్ల ఉపసంహరణ బుధవారం ముగియడంతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకంగా 15 వార్డులను గెలుచుకొని సత్తా చాటింది.

తుని గత మూడు దశాబ్దాలుగా యనమలకు పెట్టని కోట మాదిరిగా.. టీడీపీకి ఆయువుపట్టుగా ఉంది.. యనమల ప్రస్తుతం రాష్ట్ర శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగుతున్నాడు..

శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఇటీవల ముగిసిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గం కుప్పంలో చేదు అనుభవాన్ని రుచి చూశారు.ఇప్పుడు తునిలో యనమల వంతు రాబోతోందని వైసీపీ వర్గాలు అంటున్నాయి.

అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుప్పంలో మొత్తం 87 పంచాయతీల్లో 73 పంచాయతీలను గెలుచుకుంది. ఇక్కడ టిడిపి అవమానకరమైన ఓటమిని చవిచూసింది.

కుప్పం ఓటమి తరువాత ఇప్పుడు తునిలో కూడా అదే పరిస్థితి ఎదురైంది. పార్టీలో చంద్రబాబు నాయుడు పక్కనే ఉండే యనమల కూడా అవమానకరమైన ఓటమిని ఎదుర్కోబోతున్నాడన్న ప్రచారం రాజకీయవర్గాల్లో సాగుతోంది.