Begin typing your search above and press return to search.

మాల్యాకు చుక్కెదురు..! ఆస్తుల సీజ్​ కు బ్రిటన్​ హైకోర్టు ఓకే..!

By:  Tupaki Desk   |   19 May 2021 5:30 AM GMT
మాల్యాకు చుక్కెదురు..! ఆస్తుల సీజ్​ కు బ్రిటన్​ హైకోర్టు ఓకే..!
X
బ్యాంకుల్లో రూ. వేల కోట్లు రుణాలు తీసుకున్న ప్రముఖ వ్యాపారవేత్త విజయ్​ మాల్యా.. ప్రస్తుతం బ్రిటన్​ లో తలదాచుకుంటున్న విషయం తెలిసిందే. అక్కడి చట్టాలను అడ్డంపెట్టుకొని మన బ్యాంకులకు ఇంత కాలం పాటు మాల్యా చుక్కలు చూపిస్తూ వచ్చాడు. రూ. వేల కోట్లు ఎగ్గొట్టిన మాల్యా.. హాయిగా బ్రిటన్​ లో ఎంజాయ్​ చేస్తున్నాడు. అయితే ప్రస్తుతం విజయ్​ మాల్యాకు బ్రిటన్​ హైకోర్టులో చుక్కెదురైంది. భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్‌బీఐ) నేతృత్వంలోని భారతీయ బ్యాంకుల కన్సార్షియంకు అనుకూలంగా లండన్ హైకోర్టులో తీర్పు వెలువరించింది.

మాల్యా ఆస్తులపై సెక్యూరిటీ హక్కులను వదులుకోవడానికి బ్యాంకులకు యూకే హైకోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో ప్రస్తుతం మాల్యా రుణాలను జప్తు చేసుకొనేందుకు బ్యాంకులకు అవకాశం దక్కింది. ఈ మేరకు జడ్జి మైఖేల్ బ్రిగ్స్ తీర్పు చెప్పారు. చాలా రోజులుగా మాల్యా.. బ్రిటన్ చట్టాలను అడ్డుపెట్టుకొని బ్యాంకులను సతాయిస్తున్నాడు. అతడిని అరెస్ట్​ చేసేందుకు కూడా పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కానీ బ్రిటన్​లో ఉన్న చట్టాల ప్రకారం మాల్యాను అదుపులో తీసుకొనే అవకాశం లేకపోయింది.

మరోవైపు మాల్యా ఆస్తుల జప్తుకు కూడా చాన్స్​ లేకుండా పోయింది. దీంతో హాయిగా బ్రిటన్​ లో ఎంజాయ్​ చేస్తున్న మాల్యా.. బ్యాంకులను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. దీంతో అతడి ఆస్తులను జప్తు చేసుకొనేందుకు అవకాశం కల్పించాలంటూ బ్యాంకులు బ్రిటన్​ కోర్టులో కేసులు వేశాయి. ప్రస్తుతం ఈ కేసు ఓ కొలిక్కి వచ్చింది. చివరకు మాల్యా ఆస్తులు జప్తు చేసుకొనేందుకు అవకాశం కల్పిస్తూ అక్కడి కోర్టు తీర్పులు చెప్పింది. మనదేశంలో చాలా మంది పారిశ్రామిక వేత్తలు బ్యాంకుల్లో రుణాలు ఎగ్గొట్టి .. విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే. ప్రముఖ వ్యాపారి నీరవ్​ మోదీ, కింగ్​ఫిషర్​ అధినేత విజయ్​ మాల్యా అందులో అగ్రగణ్యులు. వీరి పట్ల ప్రభుత్వాలు కూడా ఉదాసీన వైఖరిని అవలంభిస్తున్నాయన్న వార్తలు వస్తున్నాయి.