Begin typing your search above and press return to search.

శశికళ కి ఎదురుదెబ్బ .. ఆ పిటిషన్ కొట్టివేత !

By:  Tupaki Desk   |   5 Dec 2020 10:20 AM GMT
శశికళ కి ఎదురుదెబ్బ .. ఆ పిటిషన్ కొట్టివేత !
X
దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకి అత్యంత సన్నిహితురాలు శశికళకి ఎదురుదెబ్బ తగిలింది. ఇక ముందస్తు విడుదల కావడం దాదాపు కష్టమే. కర్ణాటక జైళ్ల శాఖ ఉన్నతాధికారులు ప్రకటించినట్లు శశికళ వచ్చే ఏడాది జనవరి 27న విడుదలకానున్నారు. అక్రమార్జన కేసులో సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం శశికళ బెంగళూరు పరప్పణ అగ్రహారం జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఆమె వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న విడుదల కావాల్సి వుంది. అయతే సత్ప్రవర్తన తదితర కారణాల వల్ల ఆమెను జనవరి 27న విడుదల చేస్తామని ఆర్టీఐ చట్టం ప్రకారం కర్ణాటక జైళ్లశాఖ ఉన్నతాధికారులు ప్రకటించారు.

శశికళ నాలుగేళ్ల జైలు శిక్ష కాలంలో ఒక్కసారి మాత్రమే ఆమె భర్త మృతి చెందినప్పుడు పెరోలుపై విడుదలయ్యారని, ఆ తర్వాత పెరోల్‌ కోరలేదని, ప్రభుత్వ సెలవులు కూడా కలుపుకుంటే ఆమె 129 రోజులకు ముందుగా విడుదలయ్యే అవకాశం ఉందని, అపరాధపు సొమ్ము రూ.10.10 కోట్లను కూడా చెల్లించడంతో ఏ క్షణంలోనైనా ఆమె విడుదలవుతారని న్యాయవాది రాజా సెంధూర్‌పాండ్యన్‌ చెబుతూ వచ్చారు. ఆమె.. తాజాగా ముందస్తు విడుదలకు జైలు అధికారులకు దరఖాస్తు చేసుకుంది. ప్రత్యేక కోర్టులో తనకు విధించిన జరిమానా చెల్లించిన అనంతరం ఆమె 2021 జనవరి 27న జైలు నుంచి విడుదల కావాల్సి ఉండగా.. అంతకంటే ముందుగానే జైలు నుంచి బయటకు వచ్చేందుకు ఆమె ఈ దరఖాస్తు చేసుకుంది.

అయితే ,ఆ పిటిషన్ ను కోర్టు తోసిపుచ్చింది. ముందస్తు విడుదలకి కోర్టు అంగీకారం తెలుపుతుంది అని ఇప్పటికే శశికళ సన్నిహితులు అపరాధపు సొమ్ము రూ.10.10 కోట్ల కూడా చెల్లించారు. కానీ, కోర్టు పిటిషన్ ను తోసిపుచ్చింది. దీంతో శశికళ త్వరలో విడుదలవుతారని ఆశలు పెట్టుకున్న అమ్మామక్కల్‌ మున్నేట్ర కళగం నేతలు, కార్యకర్తలు, ఆమె బంధువులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇక శశికళ వచ్చే యేడాది జనవరి 27న మాత్రమే విడుదలవుతారని తెలుస్తోంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళతో పాటు ఆమె కుటుంబ సభ్యులు ఇద్దరు 2017 ఫిబ్రవరి 15 నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. వీరి ముగ్గురికి నాలుగేళ్ల సాధారణ జైలు శిక్షతో పాటు, ఒక్కొక్కరికీ రూ.10 కోట్లు చొప్పున కోర్టు జరిమానా విధించింది.