Begin typing your search above and press return to search.
మోడీకి షాక్
By: Tupaki Desk | 7 Dec 2020 9:04 AM ISTగాలి ఎప్పుడూ ఒకవైపే వీయదు. రుతువులు మారినట్టే గాలి దిశ మారుతుంది. ఎప్పుడూ బీజేపీ వైపే అనుకూలత ఉండదు. బీజేపీ తెచ్చిన వ్యవసాయ చట్టాలు ఇప్పుడు ఆ పార్టీకి సెగ పుట్టిస్తున్నాయి. రైతుల ఆందోళనతో ఢిల్లీ దద్దరిల్లుతోంది. వారికి మద్దతుగా దేశమంతా కదలుతోంది. ఇదో పెద్ద ఉద్యమం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
ఈ ఉపద్రవం చాలకముందే ప్రధాని మోడీకి మరో షాక్ తగిలింది. ప్రధాని మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గంలో రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ ఓడిపోవడం విశేషం.
పదేళ్ల తర్వాత ఈ స్థానాల్లో సమాజ్ వాదీ పార్టీ గెలుపొందడం విశేషంగా మారింది. గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ స్థానంలో అశుతోష్ సిన్హా, టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో లాల్ బిహారీ యాదవ్ విజయం సాధించారు. మొత్తం 11 ఎమ్మెల్సీ సీట్లకు ఎన్నికలు జరగగా నాలుగింటిని బీజేపీ కైవసం చేసుకుంది. మరో రెండింటి ఫలితాలు రావాల్సి ఉంది.
మోడీ ఎంపీగా గెలిచిన వారణాసిలోనే ఈ పరిస్థితి ఉందంటే వ్యతిరేకతను అర్థం చేసుకోవచ్చు. ఇక్కడే ఇంత ఉంటే ఇక దేశవ్యాప్తంగా బీజేపీపై ఎంత రగిలిపోతున్నారో మెల్లిమెల్లిగా బయటపడుతోంది. ఇప్పటికే రైతుల ఆందోళనతో అది బయటపడింది. ఇక నుంచి మోడీ హనీమూన్ ముగిసిందని.. ఆయనపై వ్యతిరేకత పెరుగుతోందని అర్థమవుతోందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు.