Begin typing your search above and press return to search.
గుంటూరు అర్బన్ ఎస్పీకి షాక్.. పోస్టింగ్ ఇవ్వలేదు
By: Tupaki Desk | 2 Jun 2021 10:30 AM ISTసంచలనంగా మారిన నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ ఎపిసోడ్ లో మరో పరిణామం చోటు చేసుకుంది. హైదరాబాద్ లో ఏపీ సీఐడీ అధికారులు అరెస్టు చేసి గుంటూరుకు తీసుకెళ్లిన తర్వాత.. చోటు చేసుకున్న పరిణామాలు తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాలతో సికింద్రాబాద్ మిలటరీ ఆసుపత్రికి ఎంపీ రఘురామ రాజును తరలించటం.. అక్కడ నుంచి ఆయన ఢిల్లీకి వెళ్లటం తెలిసిందే. మెరుగైన వైద్యం కోసం ఢిల్లీకి వెళ్లిన రఘురామ.. రెండు రోజుల క్రితం వీల్ ఛెయిర్ లో కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ కావటం తెలిసిందే.
ఈ సందర్భంగా ఆయన పలు సంచలన ఆరోపణలు చేశారు. తాను సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో ఉన్న వేళలో.. తనను అక్కడ నుంచి త్వరగా డిశ్చార్జి చేయాలన్న కుట్ర చేశారని.. ఆసుపత్రి నుంచి బయటకు వచ్చినంతనే తనను గుంటూరుకు తీసుకెళ్లేందుకు గుంటూరురూరల్ ఎస్పీ అమ్మిరెడ్డి ప్లాన్ చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా కొన్ని ఆధారాల్ని ఆయనకు చూపించినట్లుగా ప్రచారం జరుగుతోంది.
తనను త్వరగా డిశ్చార్జి చేయించేందుకు సైనిక ఆసుపత్రి రిజిస్ట్రార్ కేపీ రెడ్డి.. టీటీడీ జేఈవో ధర్మారెడ్డి.. గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డిలు కలిసి కుట్ర చేశారని రఘురామ చేసిన ఫిర్యాదు ప్రభావం తాజాగా బయటకు వచ్చింది. గుంటూరు రూరల్ ఎస్పీగా ఉన్న అమ్మిరెడ్డికి త్వరలో మరింత మంచి పోస్టు వస్తుందని ఆశిస్తున్న వేళ.. ఆయనపై అనూహ్య రీతిలో వేటు పడింది. ఆయన్ను గుంటూరు రూరల్ ఎస్పీ పోస్టు నుంచి బదిలీ చేస్తూ అధికార ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఆయన్ను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన్ను డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని పేర్కొన్నారే కానీ ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకపోవటం గమనార్హం. రాజ్ నాథ్ కు కంప్లైంట్ చేసిన నేపథ్యంలో కేంద్రం నుంచి వచ్చిన సూచనలకు అనుగుణంగానే అమ్మిరెడ్డిపై బదిలీ వేటు పడిందని చెబుతున్నారు. వీల్ ఛెయిర్ లో రాజ్ నాథ్ ఇంటికి వెళ్లిన రఘురామ తన మార్కు చూపించారన్న మాట వినిపిస్తోంది. గుంటూరు రూరల్ ఎస్పీగా అమ్మిరెడ్డి స్థానంలో కె.అరీఫ్ హఫీజ్ ను నియమిస్తూ ఏపీ సర్కారు నిర్ణక్ష్ం తీసుకుంది.