Begin typing your search above and press return to search.

పేర్ని నానిపై హత్యాయత్నం కేసులో కొల్లు రవీంద్రకు షాక్

By:  Tupaki Desk   |   3 Dec 2020 1:10 PM IST
పేర్ని నానిపై హత్యాయత్నం కేసులో కొల్లు రవీంద్రకు షాక్
X
సమాచార ప్రసారాల శాఖా మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. మంత్రి నానిపై బడుగు నాగేశ్వరరావు అనే వ్యక్తి తాపీతో హత్య చేసేందుకు ప్రయత్నించడం సంచలనం రేపింది. ఈ దాడి వెనుక టీడీపీ కుట్ర ఉందన్న ఆరోపణలు వచ్చాయి. భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్న నాగేశ్వరరావు... రెక్కీ నిర్వహించి మరీ మంత్రిపై దాడికి యత్నించాడని పోలీసుల విచారణలో తేలింది. టీడీపీ మహిళా నేత ఉమాదేవి సోదరుడైన నాగేశ్వరరావు రాజకీయ దురుద్దేశ్యం తోనే ఈ దాడికి పాల్పడ్డాడని అనుమానాలు వ్యక్తం చేశారు. దాడి చేసేంతటి అవసరం తన తమ్ముడికి ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదని ఉమాదేవి అన్న వ్యాఖ్యలు టీడీపీ కుట్రకు బలాన్ని చేకూర్చాయి.

మరోవైపు, ప్రభుత్వంపై వ్యతిరేకతతోనే నాగేశ్వరరావు ఈ దాడి చేశాడని టీడీపీ నేతలు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. సీఆర్‌పీసీ 91 కింద రవీంద్రకు నోటీసులు ఇచ్చారు. హత్యాయత్నంపై నిరాధార వ్యాఖ్యలతో ఈ కేసును రవీంద్ర తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్న కారణంతో ఈ నోటీసులు పంపారు. తగిన ఆధారాలతో విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే నాగేశ్వరరావుతో టచ్‌ లో ఉన్న టీడీపీ నేతల గుండెల్లో దడ మొదలైంది. పోలీసుల కస్టడీ లో నాగేశ్వరరావు ఏమి చెబుతాడోనని గుబులు మొదలైంది. పేర్ని నాని అనుచరుగు మోకా హత్య కేసులోనూ రవీంద్ర హస్తముందన్న ఆరోపణ లు వచ్చిన సంగతి తెలిసిందే.