Begin typing your search above and press return to search.
విశాఖ తీరానికి కొట్టుకొచ్చిన భారీ నౌక.. పోటెత్తిన జనాలు
By: Tupaki Desk | 13 Oct 2020 5:40 PM ISTవిశాఖ తీరంలో భారీ తుఫాన్ తీరం దాటి వర్షాలు జోరుగా కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సముద్రంలో ప్రయాణిస్తున్న బంగ్లాదేశ్ కు చెందిన ఓ వ్యాపార నౌక భారీ ఈదురు గాలులకు విశాఖ తీరానికి కొట్టుకు వచ్చింది. విశాఖ తెన్నేటి పార్క్ సమీపంలో ఈ భారీ నౌక ఒడ్డుకు చేరింది. గాలి తీవ్రతకు ఒడ్డుకు చేరి పార్క్ సమీపంలోని రాళ్లలో చిక్కుకుంది.
అర్ధరాత్రి సమయంలో ఇసుక తిన్నెల మధ్య చిక్కుకోగా.. నౌకలోని సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. యాంకర్లు రెండూ ధ్వంసం కావడంతో ఈ సమస్య తలెత్తిందని అధికారులు చెబుతున్నారు.
విషయం తెలిసిన నేవీ అధికారులు, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని నౌకను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. నౌకలో 15 మంది సిబ్బంది ఉన్నారు.
విశాఖ-నర్సాపూర్ మధ్యన కాకినాడపైన ప్రాంతంలో తీవ్ర వాయుగుండం తీరం దాటింది. ఈ వాయుగుండం ధాటికి ఈ భారీ నౌక విశాఖ తీరానికి కొట్టుకు వచ్చింది.