Begin typing your search above and press return to search.
ఫ్యామిలీతో హైదరాబాద్ లో ఇక బతకలేం..
By: Tupaki Desk | 5 July 2019 1:42 PM ISTబ్యాచ్ లర్ గా ఓకే.. కానీ ఫ్యామిలీతో ఇక హైదరాబాద్ లో బతకలేం అని తేలిపోయింది. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా హైదరాబాద్ లో ఉద్యోగంలో చేరే వాళ్లకు 15వేల నుంచి 25వేల వరకు ఉంటుంది. కొత్త సాఫ్ట్ వేర్ ఇంజినీర్లుగా ట్రెయిన్ పీరియడ్ లో చేరేవాళ్లకు కూడా ఎంతలేదన్నా 25వేల నుంచి 35 వేల లోపే ఇస్తున్నారు. ఇప్పుడు ఈ జీతంలో హైదరాబాద్ లో పనిచేయడం అంత ఈజీ కాదని తేలింది.
దేశంలోని ఇతర నగరాలతో పోల్చితే హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో అద్దెల రేట్లు చుక్కలు చూపిస్తున్నాయని తాజాగా పలు సంస్థల అధ్యయనంలో తేలింది. మొత్తం 15 నగరాల్లో ఇంటి అద్దెలపై తాజాగా సర్వే జరిగింది. ఇందులో కోల్ కతా- బెంగళూరు- అహ్మదాబాద్ లో అత్యధిక అద్దెల రేటు 6.5 శాతంగా ఉండగా.. ఒక్క హైదరాబాద్ లో మాత్రం 8 శాతం వృద్ధితో ఉండడం ఆందోళన కలిగిస్తోంది.
హైదరాబాద్ లో హైటెక్ సిటీలో అద్దె రూ.20వేల వరకు సింగిల్ బెడ్ రూం ఇళ్లతో అత్యధిక రేట్ గల ప్రాంతంగా వర్థిల్లుతోంది. ఇక అత్యల్పంగా పాతబస్తీలో రూ.8వేల అద్దె మాత్రమే ఉంది. ఓల్డ్ సిటీలోనే అత్యంత తక్కువ అద్దె హైదరాబాద్ లో ఉందట.
ఇప్పుడు ఈ మోతకోలు అద్దెలతో 20 నుంచి 25వేల సగటు జీతం ఉన్న సామాన్య ఉద్యోగులు తమ జగం జీతాన్ని అద్దెలకే కోల్పోతున్నారు. దీంతో పొదుపు, పిల్లల స్కూళ్లకు ఏమీ మిగలడం లేదని సామన్యులు గగ్గోలు పెడుతున్నారు. ఇలా హైదరాబాద్ లో 25వేల జీతం ఉన్నా బతకలేని పరిస్థితి దాపురించింది.