Begin typing your search above and press return to search.

రాజమండ్రి : కరోనా వేళ కిక్కిరిసిన రోడ్లు .. ఇలా అయితే కష్టమే ?

By:  Tupaki Desk   |   20 July 2020 3:00 PM GMT
రాజమండ్రి : కరోనా వేళ కిక్కిరిసిన రోడ్లు .. ఇలా అయితే కష్టమే ?
X
కరోనా వైరస్ ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకి తన పరిధిని పెంచుకుంటూపోతుంది. ఏపీలో నమోదు అయ్యే కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. రికార్డ్ స్థాయిలో గత రెండు రోజుల్లోనే ఏపీలో 10 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ లెవెల్ ఏపీలో ఇంతకుముందు కరోనా కేసులు నమోదు కాలేదు. ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య ఊహించని విధంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలోనే రాష్ట్రంలోనే ఎక్కువ కేసులు నమోదు అయ్యాయి...అవుతున్నాయి.

దీనితో జిల్లా అధికారులు జిల్లా పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇందులో భాగంగానే ఆదివారం 24 గంటల లాక్ డౌన్ అమలు చేసారు. అలాగే అత్యవసరం అయితే తప్ప ఎవరు ఇంట్లో నుండి బయటకి రావొద్దు అని, భౌతిక దూరం పాటించాలని, పేస్ మాస్కులు ధరించాలని ప్రభుత్వం, అధికారులు, పోలీసులు ప్రతిరోజూ జిల్లా వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. అయితే, అధికారులు ఎంతగా ప్రచారం చేస్తున్నా కూడా ప్రజల్లో ఏ మాత్రం మార్పు రావడం లేదు. కరోనా మాకు రాదులే అన్న దైర్యం ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఏమిటి అంటే ..ఆదివారం పూర్తిగా లాక్ డౌన్ అమలు చేస్తే.. సోమవారం ఉదయం రోడ్ల మీదకు జనాలు భారీ సంఖ్యలో వచ్చేశారు.

ఆదివారం ఎందుకు లాక్ డౌన్ అమలు చేసారు అన్న చిన్న విషయాన్ని కూడా గమనించకుండా .. అవసరం లేకున్నా కూడా బయటకి వచ్చి కరోనా వ్యాప్తికి కారణం అవుతున్నారు. ముఖ్యంగా బయటకి వస్తే .. కరోనా నియమాలని కూడా పాటించడం లేదు. పేస్ మాస్కులు పెట్టు కోకుండా రోడ్లమీదకు వచ్చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలని పోలీసులు, అధికారులు చెప్తున్నా ప్రజలు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఇలాగైతే జిల్లాలో కరోనాను కంట్రోల్ చేయడం కష్టం అని అధికారులు తలలు పట్టుకుంటున్నారు.