Begin typing your search above and press return to search.

నచ్చిన ఛానల్స్‌ కే డబ్బులు అనేది షుగర్‌ కోటింగ్‌ మాత్రమే

By:  Tupaki Desk   |   28 Dec 2018 12:43 PM IST
నచ్చిన ఛానల్స్‌ కే డబ్బులు అనేది షుగర్‌ కోటింగ్‌ మాత్రమే
X
టీవీ ఛానల్స్ అన్నీ ఏకమైపోయాయి. అందరూ కలిసి ఇప్పుడు సరికొత్త డ్రామాకు తెరతీశారు. ఇక నుంచి మీరు చూసే ఛానల్స్‌ కే డబ్బులు అంటూ ప్రకటనలు ఊదరగొట్టేస్తున్నారు. ప్రేక్షకుల్ని పిచ్చోళ్లని చేసి.. వాళ్ల డబ్బులకే ఎసరు పెడుతున్నారు. చూస్తున్న ఛానెల్‌ కే డబ్బులు అనే ప్రకటన చూసి మనం ఏమనుకుంటాం.. ఇక నుంచి మన చూసే ఛానల్స్‌ కే డబ్బులు కట్టాలి కాబట్టి.. ప్రతీ నెల మనం కట్టే కేబుల్‌ బిల్‌ తగ్గిపోతుందని భావిస్తాం. ఇక్కడే అసలు మెలిక పెట్టి.. మనల్ని దోచుకునేందుకు ఛానెల్స్‌ అన్నీ ఏకమయ్యాయి.

చానెల్స్‌ కొత్త నిబంధనల ప్రకారం మనకు నచ్చిన ప్యాక్‌ లను మనం తీసుకోవచ్చు. ఉదాహరణకు ఈటీవీ అన్నీ ఛానెల్స్‌ ఒక ప్యాక్‌, స్టార్‌ ఒక ప్యాక్‌, జీ తెలుగు ఒక ప్యాక్‌, జెమినీ ఒక ప్యాక్‌ లుగా విభజించారు. యావరేజ్‌ న ఒక్కో ప్యాక్‌ రూ.25 పైనే ఉంది. మన తెలుగువారికి.. ఈ నాలుగు ప్యాక్‌ లు కచ్చితంగా కావాల్సిందే. అంటే నాలుగు కొనుక్కోవాల్సిందే. ఈ నాలుగు ప్యాక్‌ లు దాదాపు రూ.100 పైనే అవుతాయి. అయితే.. ఇవి తీసుకున్నా తీసుకోకపోయినా.. బేసిక్‌ ప్యాక్‌ ఒకటి ఉంటుంది. అది మాత్రం కచ్చితంగా తీసుకోవాల్సిందే. ఈ బేసిక్‌ ప్యాక్‌ లో ఫ్రీగా వచ్చే ఛానెల్స్‌ ఉంటాయన్నమాట.

అంటే.. బేసిక్‌ ప్యాక్‌ రూ.150, మనకు కావాల్సిన తెలుగు ప్యాక్‌ మొత్తం కలుపుకుంటే.. దాదాపు రూ.250 దాటుతుంది. వీటికి అన్ని ట్యాక్సులు కలుపుకుంటే రూ.300 అవుతుంది. ఓన్లీ బేసిక్‌ ప్యాక్‌ తీసుకుంటే… అందులో మనకు నచ్చిన ఛానెల్స్‌ రావు. ఇవి కాకుండా మనకు ఇంకా ఏవైనా కావాలి అనుకుంటే.. డబ్బులు కట్టుకుంటూ వెళ్లడమే. అంటే మనకు తెలీకుండా మన జేబుల్లోంచి దాదాపు రూ.300 నుంచి రూ.500 వరకు లాగేస్తున్నాయి ఈ ఛానెల్స్‌. ఒకవేళ బేసిక్‌ ప్లాన్‌ లేకుండా మనకు నచ్చిన ఛానెల్స్‌ చూద్దామంటే… అలా చూడకుండా రూల్స్‌ మార్చేశారు. పైకి మాత్రం మీరు చూసే ఛానెల్‌ కే డబ్బులు అంటూ ప్రచారం చేస్తున్నారు.