Begin typing your search above and press return to search.

చైనా నిర్ణయంతో అలీబాబాకు 8.5 లక్షల కోట్ల నష్టం

By:  Tupaki Desk   |   30 Dec 2020 3:24 PM GMT
చైనా నిర్ణయంతో అలీబాబాకు 8.5 లక్షల కోట్ల నష్టం
X
విస్తరణ వాదంతో.. ప్రపంచంపై గుత్తాధిపత్యం కోసం కుట్రలు పన్నుతున్న చైనా దేశం ఆ దేశంలోని పారిశ్రామికవేత్తలను కూడా బతకనివ్వడం లేదు. విదేశాలకు మేలు చేస్తున్న చైనా దిగ్గజ సంస్థలను సైతం నీరుగారిపోయేలా చేస్తోంది.

తాజాగా చైనాకు చెందిన దిగ్గజ ప్రముఖ ఈకామర్స్ సంస్థ అలీబాబాకు చైనా ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. చైనా ప్రభుత్వం నిర్ణయంతో అలీబాబా సంస్థ తీవ్ర నష్టాల పాలైంది. మునుపెన్నడూ చూడనంత పతనాన్ని చవిచూసింది.

అలీబాబా అనుబంధ సంస్థపై తాజాగా యాంటీ ట్రస్ట్ విచారణ నిర్వహిస్తామని చైనా నియంత్రణ సంస్థల అధికారులు ప్రకటించడం దుమారం రేపింది. ఈ దెబ్బకు న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజీలో అలీబాబా షేర్ విలువ ఏకంగా 15శాతం పడిపోయింది. యాంటి ట్రస్ట్ విచారణతో జరిమానాలు భారీగా చైనా ప్రభుత్వం విధించబోతోందన్న భయంతో ఎక్కువమంది అలీబాబా షేర్ ను విక్రయిచండంతో ఏకంగా అలీబాబా సంపదన 116 బిలియన్ డాలర్ల మేర పతనమైంది. అంటే మన కరెన్సీలో దాదాపు 8.5 లక్షల కోట్లన్న మాట..

అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా తాజాగా యాంట్ సంస్థపై ఐపీవోకు వెళ్లాడు. 10 బిలియన్ డాలర్లకు బైబ్యాక్ పెంచారు. అయినా కూడా అలీబాబా షేర్ కోలుకోలేదు. దీంతో అలీబాబా సంపద ఆవిరి అయిపోయింది. చైనా ప్రభుత్వం విచారణతో అలీబాబా సంపది కొట్టుకుపోయింది.అమెరికాకు సపోర్టుగా నిలబడ్డందుకే చైనా ప్రభుత్వం ఇలా అలీబాబా సంస్థపై కక్షసాధింపు చర్యలు చేపడుతున్నట్టు ప్రచారం సాగుతోంది.