Begin typing your search above and press return to search.

యాషెస్ టెస్ట్: స్మిత్, వార్నర్ లకు ఘోర అవమానం

By:  Tupaki Desk   |   2 Aug 2019 9:30 AM GMT
యాషెస్ టెస్ట్: స్మిత్, వార్నర్ లకు ఘోర అవమానం
X
సంవత్సరం గడిచింది. చేసిన తప్పును ఒప్పుకున్నారు.. సంవత్సరం పాటు క్రికెట్ కు దూరమై శిక్ష కూడా అనుభవించారు. ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలోనే బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడి స్మిత్- వార్నర్ లు చరిత్రహీనులుగా మారిపోయారు. వారిపై ఆస్ట్రేలియా క్రికెట్ ఏడాది నిషేధం విధించారు. గత ఐపీఎల్ తో ఏడాది పూర్తికావడంతో ఇండియా లో వారు మళ్లీ క్రికెట్ బ్యాట్ పట్టి ఆడారు.

దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ సందర్భంగా స్మిత్- వార్నర్ ల ప్రోత్సాహంతో బాన్ క్రాఫ్ట్ బాల్ ను శాండ్ పేపర్ తో బాల్ ను రుద్దాడు. ట్యాంపరింగ్ కు పాల్పడ్డాడు. ఈ ఉదంతం ప్రపంచ క్రికెట్ లో దుమారం రేపింది. దీంతో స్మిత్- వార్నర్ పై సంవత్సరం బాన్ క్రాఫ్ట్ పై ఆరు నెల లు నిషేధం విధించారు.

ఈ ప్రపంచకప్ క్రికెట్ తో స్మిత్- వార్నర్ ఎంట్రీ ఇచ్చి అదరగొట్టారు. ఇంగ్లండ్ తో మ్యాచ్ సందర్భంగా స్మిత్- వార్నర్ లను చీటర్స్ అంటూ అభిమానులు అవమానించారు. భారత్ తో మ్యాచ్ సందర్భంగా అభిమానులు ఇలాంటి చర్యకు పాల్పడితే కోహ్లీ హెచ్చరించడంతో వెనక్కి తగ్గాడు.

తాజాగా ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య ప్రపంచ చాంపియన్ షిప్ లో భాగంగా ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ ప్రారంభమైంది. ఇంగ్లీష్ అభిమానులు మరోసారి తమ దుందుడుకు స్వభావాన్ని స్టేడియంలో కనబచ్చారు. స్మిత్- వార్నర్ లు బ్యాంటింగ్ కు వచ్చినప్పుడు అదే శాండ్ పేపర్ ను చూపిస్తూ ఇంగ్లాండ్ అభిమానులు హేళన చేశారు. ‘మోసగాళ్లు.. మోసగాళ్లు’ అంటూ నినాదాలు చేశారు. ఔటై పోయినప్పుడు ఇలానే గేలి చేశారు. ‘ఇంగ్లండ్ చాంప్స్, అసీస్ చీట్స్’ అంటూ ఫ్లకార్డ్ పట్టుకొని ఎండగట్టారు. ఇంగ్లీష్ అభిమానుల చేష్టలతో స్మిత్- వార్నర్ లకు తీవ్ర అవమానం ఎదురైంది.